టీడీపీ వివాదాస్పద ఎంపీ ఇటీవల రాజీనామా వ్యవహారం నాటకీయంగా సాగిన సంగతి తెల్సిందే. చాగల్లు రిజర్వాయర్‌కు నీటి కేటాయింపు, అనంతపురం రోడ్ల విస్తరణ విషయాల్లో సొంత పార్టీలోనే తన మాట చెల్లడం లేదన్న ఆగ్రహంతో తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు..ఎంపీగా,ఎమ్మెల్యేగా ఉండి తాను ప్రజలకు ఏం చేయలేకపోతున్నానని, తన సిఫార్సులు పని చేయడం లేదని,అందుకే రాజీనామా చేస్తున్నానని గత నెల జేసీ ప్రకటించి సంచలనం సృష్టించారు. .అయితే జేసీ రాజీడ్రామాకు అధిష్టానం దిగి వచ్చింది. ఆ తర్వాత ఆయన డిమాండ్ ప్రకారం చాగల్లు రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేసింది. దీంతో జేసీ రెండు రోజుల క్రితం మాట్లాడుతూ.. రాజీనామా చేస్తే ఏమొస్తుందని,ఆ రోజు బాధలో మాట్లాడానంటూ మాట మార్చారు..అయితే జేసీ రాజీడ్రామా వెనుక చాగల్లురిజర్వాయర్ నీటి కేటాయింపు విషయం కానే కాదు..అది చినబాబు లోకేష్‌తో కమీషన్ల దగ్గర వచ్చిన పేచీతో జేసీ రాజీనామా అస్త్రం సంధించినట్లు విశ్వసనీయ సమాచారం. హెచ్ ఎల్సీ ఆధునీకరణ పనుల టెండర్‌ను ఇటీవల రూ. 420. 76 కోట్లకు నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకుంది. ఈ మొత్తంలో కమిషన్ విషయంలో లోకల్‌లో ఎంపీ జేసీతో డీల్ కుదిరింది. జేసీకి 5 శాతం కమీషన్ ఇచ్చేందుకు కంపెనీ అంగీకరించింది..అంటే దాదాపు రూ. 20 కోట్లు కమీషన్ కింద జేసీ చేతిలో పడనున్నాయి..
ఇంతలోనే సీన్‌లోకి చినబాబు లోకేష్ ఎంటరయ్యాడు..హెచ్‌ఎల్పీ పనుల్లో వచ్చే కమీషన్లో నాకు కూడా వాటా కావాలని లోకేష్ పేచీ పెట్టాడు..సరిగ్గా రూ. 20 కోట్లు చేతిలో పడే సమయాని
కలెక్షన్ కింగ్‌లా లోకేష్ ఎంటరూ వాటా కోసం పేచీ పెట్టడంతో జేసీకి చిర్రెత్తుకువచ్చింది. బాబుగారబ్బాయి లోకేష్ కూడా వాటా అడుగుతున్నాడు..కమీషన్ పర్సంటేజీ పెంచమని జేసీ నాగార్జున
కంపెనీని అడిగాడు..అయితే కంపెనీ మాత్రం ముందుగా అనుకున్న ప్రకారం మీకు కమీషన్ ఇస్తాం..అంతే కానీ ఇప్పుడు బాబుగారి అబ్బాయి లోకేష్ అడుగుతున్నాడని చెప్పి కమీషన్ పెంచడం కుదరదు అని తేల్చి చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న లోకేష్ వెంటనే హెచ్ఎల్సీ పనులు నిలుపుదల చేయించాడు. దీంతో జేసీకి రావాల్సిన కమీషన్ ఆగిపోయింది..ఇంకేముంది నోటి కాడి కూడును లోకేష్ లాక్కోవడంతో చిర్రెత్తుకువచ్చిన జేసీ వెంటనే రాజీనామా డ్రామా ఆడినట్లు సమాచారం. దీంతో చంద్రబాబు మంత్రి దేవినేని ఉమను రంగంలోకి దింపి జేసీ డిమాండ్‌లను నెరవేరుస్తాం కానీ ముందు ఆయన్ని రాజీనామా డ్రామా ఆపేయమని చెప్పించాడు.. అందుకే జేసీ రాజీనామా చేస్తే ఏమొస్తుందని మాట తిరగేశా రు..మొత్తానికి కమీషన్లు పంచుకోవడంలో లోకేష్‌తో జరిగిన తగాదాల వల్లే జేసీ రాజీనామా డ్రామా ఆడినట్లు తెలుస్తుంది. దీన్ని బట్టి లోకేష్ ఏ మేరకు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏ రేంజ్‌లో కమీషన్లు నొక్కేస్తున్నాడో తెలుస్తుందని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తుంది.