Home / ANDHRAPRADESH / టీడీపీ కంచు కోటలో బాబుకు షాక్ …ఖుషిలో వైసీపీ శ్రేణులు ..

టీడీపీ కంచు కోటలో బాబుకు షాక్ …ఖుషిలో వైసీపీ శ్రేణులు ..

గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన జిల్లా అది .అప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఆ జిల్లా ఒకేసారి టీడీపీ పార్టీకి కంచుకోటగా తయారైంది .ఆ జిల్లాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు అంటేనే టీడీపీ ప్రభంజనం ఎలా ఉందో మనకు అర్ధమవుతుంది .అంతటి కంచుకోట అయిన ఆ జిల్లాలో ఇప్పుడు ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు దిమ్మతిరిగే షాకిచ్చారు . ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి విదితమే .

అయితే ఈ కార్యక్రమానికి గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి కారణమైన జిల్లాలో ఒకటైన పశ్చిమ గోదావరి జిల్లాలో మిశ్రమ స్పందన వస్తుంది .ఏకంగా మంత్రులుగా ఉన్న నియోజక వర్గాల్లోనే ఇలా జరగడం ఇటు బాబును అటు పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తుంది .జిల్లాలో మంత్రులుగా ఉన్న పీతాని సత్యనారాయణ నియోజక వర్గమైన ఆచంట ,మరో మంత్రి జవహర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న కొవ్వూరు నియోజక వర్గం ,తమ మిత్రపక్షమైన బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ,దేవాదాయ శాఖ మంత్రి అయిన పి మాణిక్యాల రావు నియోజక వర్గమైన తాడేపల్లి గూడెం,ఎమ్మెల్యేలు అయిన బడేటి కోట రామారావు నియోజక వర్గమైన ఏలూరు ,చింతమనేని ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న దెందులూరు నియోజక వర్గం ,మాజీ మంత్రి పీతల సుజాత నియోజక వర్గమైన చింతల పూడి నియోజక వర్గం ,అరిమిల్లి రాధాకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తోన్న తణుకు ,బి మాధవ్ నాయుడు నియోజక వర్గమైన నరసపూరం ,ఎమ్ శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తోన్న పోలవరం లాంటి నియోజక వర్గాల్లోనే కాకుండా ఏకంగా ఎంపీ నియోజక వర్గమైన ఏలూరు లో కూడా అనుకున్నంత స్థాయిలో ప్రజల నుండి స్పందన రాకపోవడంతో బాబుతో సహా అందరు ఆందోళన చెందుతున్నారు .

ప్రజల నుండి స్పందన రాకపోవడం వలన తెలుగు తమ్ముళ్ళు ఆందోళన చెందటంలేదు .ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ నిర్వహిస్తున్న నవరత్నాల కార్యక్రమానికి ప్రజల నుండి స్పందన రావడంతోనే బాబు అండ్ బ్యాచ్ ఆందోళన చెందుతున్నారు .ఈ నేపథ్యంలో పరిస్థితులు ఇలాగె ఉంటె ఈ జిల్లాలో టీడీపీ పార్టీ దుఖానం మూసుకోవడం ఖాయం అని తెలుగు తమ్ముళ్ళు వాపోతున్నారు .అయితే ప్రజల నుండి మిశ్రమ స్పందన రావడానికి ప్రధాన కారణం కాపు జాతిని ఘోరంగా మోసం చేయడమే కాకుండా కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పై కేసులు బనాయించడం ..కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని పలు అక్రమ కేసులను పెట్టి వేదించడం కూడా దీనికి ప్రధాన కారణం అని తెలుగు తమ్ముళ్ళు బాబుకు నివేదించారు అంట .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat