బాదం, పిస్తా, వాల్‌నట్‌లు, జీడిపప్పు మరియు వేరుశనగ గింజలు వంటి నట్స్ తినడం వలన పలు పోషకాలు లభిస్తాయి. కొద్దిగా నట్స్ రోజూ తినడం వలన మన శరీరానికి అవసరమైన విటమన్‌లు, ఖనిజాలు, ఆరోగ్యవంతమైన కొవ్వు, ప్రోటీన్‌లు మరియు పీచు వంటి అంశాలు లభిస్తాయి. ఇవి అన్నీ మీ గుండె, మెదడు ఉత్తమంగా పని చేయడంలో మరియు నడుము కొలతలు మారకుండా చూసుకోవడంలో సహాయపడతాయి.
మీరు నట్స్ తినడం వలన పొందగల 5 ముఖ్యమైన పోషకాలు…
ఆరోగ్యవంతమైన కొవ్వులు (Healthy fats)
నట్స్‌లో ఆరోగ్యవంతమైన మోనో మరియు పాలీఅన్‌శాచ్యురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఈ కొవ్వులు ప్రతి శరీర కణం యొక్క వాపును నియంత్రించడానికి మరియు వాటి సాధారణ ఆకృతిని కొనసాగించడానికి సహాయపడతాయి. శాచ్యురేటెడ్ మరియు ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినడం వలన పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని పరిశోధనల్లో తేలింది. ఆరోగ్యవంతమైన కొవ్వులు గల ఆహార పదార్థాలను తినడం వలన కొలెస్ట్రాల్ తగ్గుతుంది మరియు నొప్పి తగ్గుతుంది.
పీచు పదార్థాలు (Fibres)
నట్స్‌లో పీచు పుష్కలంగా ఉంటుంది. పీచు జీర్ణశక్తి వేగాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది, దీని వలన మీకు చాలా సమయం వరకు ఆకలి వేయదు. వీటి వలన మీకు ఆకలి తక్కువగా ఉంటుంది, దీని వలన కొంతకాలానికి మీరు బరువు తగ్గగలరు. పీచు జీర్ణాశయంలోకి ప్రవేశించినప్పటికీ, అది జీర్ణం కాదు మరియు జీర్ణం కాని పీచు మీ మలంలో భారంగా మారి, మలవిసర్జనలో సహాయపడుతుంది. పీచు నిర్దిష్ట యాంత్రిక చర్య ద్వారా కొలెస్ట్రాల్ శోషణను కూడా తగ్గిస్తుంది.
ప్రోటీన్‌లు (Proteins)
నట్స్‌లో ఉండే ప్రోటీన్ పదార్థం ఎక్కువగా ఉంటుంది, అంటే వాల్‌నట్‌ల్లో 10% కాగా, అది బాదం పప్పులో 17% ఉంటుంది. అత్యధిక నట్స్‌లో ఎల్-ఆర్జినైన్ అని పిలిచే అమినో ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త నాళాల విధులను మెరుగుపరుస్తాయి మరియు రక్త నాళాలను వదులు చేస్తాయి మరియు మరింత సౌకర్యవంతంగా చేస్తాయి. ఇది రక్తనాళాల్లో రక్త ప్రసారానికి అంతరాయం కలిగేలా గడ్డకట్టే అవకాశాలను కూడా తగ్గిస్తుంది. అర్జినైన్ గాయాలు త్వరగా మానడంలో సహాయపడి రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది మరియు ఇప్పటికే ఉన్న గుండె వ్యాధిని నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. నట్స్‌లో ఆర్జినైన్ పుష్కలంగా ఉంటుంది. బాదం, వాల్‌నట్‌లు మరియు వేరుశనగ పప్పుల్లో ఆర్జినైన్ అధికంగా ఉంటుంది.
విటమన్ ఇ (Vitamin E)
నట్స్ అనేవి విటమన్ ఇ అధికంగా గల పదార్థాలు. ఈ కొవ్వు కరిగే విటమన్ అనేది చాలా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది మన శరీరంలో స్వేచ్ఛా ధాత్వంశాలచే సంభవించే నష్టాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఇంకా ఆరోగ్యవంతమైన చర్మం, మంచి రోగ నిరోధక వ్యవస్థ మరియు ఇతర జీవ సంబంధిత విధానాలకు విటమన్ ఇ చాలా కీలకమైనది. మరీ ముఖ్యంగా, విటమన్ ఇ అనేది హృద్ధ దమని వ్యాధికి దారి తీసే ధమని ఫలకాల అభివృద్ధిని నివారించడంలో సహాయపడుతుందని పరిశోధనల్లో తేలింది. ఈ విటమన్ ఇ బాదం, వేరుశనగ పప్పులు మరియు హాటల్‌నట్స్‌లో పుష్కలంగా లభిస్తుంది.
ఖనిజాలు (Minerals)
నట్స్‌లో మాంగనీస్, కాల్షియం, పొటాషియం, మాగ్నీషియం, ఐరన్, జింక్ మరియు సెలీనియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మాంగనీస్ ఎంజైమ్‌లతో కలిసి పని చేస్తుంది మరియు ఇది శక్తివంతమైన స్వేచ్ఛా ధాత్వంశాల శుద్ధికారిగా పని చేస్తుంది. పొటాషియం అనేది శరీర ద్రవాల్లో ముఖ్యమైన అంశం మరియు గుండె రేటును మరియు రక్తపోటును నియంత్రిస్తుంది. రాగి అనేది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఆవశ్యకం. రక్తంచే ఆక్సిజన్ సరఫరాకు ఐరన్ అవసరమవుతుంది.
ఇప్పుడు వీటిని ఎంత మోతాదులో తినడం వలన అత్యధిక ప్రయోజనాలు లభిస్తాయి అనే ప్రశ్న జనిస్తుంది!
నట్స్‌లో కొవ్వు అంశం ఎక్కువగా ఉంటుంది. అవి ఆరోగ్యవంతమైన కొవ్వులు అయినప్పటికీ, దీని వలన కెలోరీలు పెరుగుతాయి. కనుక మీరు నట్స్‌ను మితంగా మాత్రమే తినాలి. మీరు మాంసం, గుడ్లు మరియు పాల ఉత్పత్తులు నుండి లభించే కొవ్వులు వలె శాచ్యురేటెడ్ కొవ్వులకు ప్రత్యామ్నాయంగా నట్స్ భుజించాలి.
రోజూ నట్స్‌ను సుమారు 30 గ్రాముల చొప్పున తినాలి, అంటే సుమారు 20 -24 బాదంపప్పులు లేదా 15-18 జీడిపప్పులు లేదా 18-20 హాటల్‌నట్స్ లేదా 2 టేబుల్‌స్పూన్‌ల పైన్ నట్స్ లేదా 30-40 పిస్తా గింజలను లేదా 9-11 వాల్‌నట్ గింజలు లేదా కొద్ది మోతాదులో అన్ని నట్స్ కలిపి తినాలి.
కేవలం నట్స్ తిని, మీరు తినే శాచ్యురేటెడ్ కొవ్వుల మోతాదును నియంత్రించకపోతే, మీరు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందరని దయచేసి గమనించండి. మీరు తినే నట్స్ వలన మీకు ఎలాంటి అలర్జీ రాదని నిర్ధారించుకోండి.