సింగరేణి వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. కార్మికులు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు 60.46 శాతం పోలింగ్ నమోదు అయింది. కొత్తగూడెం ఏరియా, కార్పొరేట్ ఏరియాలో 63.95 శాతం పోలింగ్ నమోదు అయింది. శ్రీరాంపూర్‌లో 60 శాతం, మందమర్రిలో 59.23 శాతం, బెల్లంపల్లిలో 71.66 శాతం, భూపాలపల్లిలో 52 శాతం, రామగుండం ఆర్‌జీ1లో 60 శాతం, ఆర్‌జీ2లో 52 శాతం పోలింగ్ నమోదు అయినట్టు పోలింగ్ అధికారులు తెలిపారు.
