ఏపీ సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇంత వరకు కుప్పంలో ఓటమి ఎరుగని నేతగా చంద్రబాబుకు పేరుంది. దశాబ్దాలుగా కుప్పం టీడీపీకి కంచుకోటగా నిలుస్తోంది. చిత్తూరు జిల్లాలో వైసీపీ పాగా వేసినా కుప్పంలో మాత్రం చంద్రబాబుకు ఎదురులేకుండా పోయింది. అయితే బాబు గెలుపు వెనుక షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి.. కుప్పంలో దాదాపు 43 వేల బోగస్ ఓట్లు ఉన్నట్లు సాక్షాత్తు భన్వర్‌లాల్ ప్రకటించిన సంగతి తెల్సిందే. వీటిలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారివే 20 వేల ఓట్లు బోగస్ అని తేలింది. వీరికి వారి రాష్ట్రాలతో పాటు, కుప్పంలో కూడా ఓట్లు నమోదు అయినట్లు ఎలక్షన్ కమీషన్ తెలిపింది. చంద్రబాబుకు వరుసగా మంచి మెజారిటీతో గెలవడం వెనుక ముఖ్యంగా తమిళనాడు, కర్నాటక ఓటర్లే అని తెలుస్తోంది. చంద్రబాబు తెలివిగా ప్రతిసారి కుప్పంలో బోగస్ ఓటర్ల పేర్లను ఓటింగ్ లిస్ట్‌లో చేరుస్తున్నట్లు సమాచారం.
. ఇటీవల నియోజకవర్గ పరిధిలోని రావుకుప్పం వుండలం కెంచనబల్ల పంచాయుతీ పరిధిలోని ఓటర్ల జాబితాను అధికారులు పరిశీలించారు. ఈ పంచాయుతీ పరిధిలో 2,689 వుంది ఓటర్లున్నారు. వీరి పేర్లే శాంతిపురం వుండలం బడుగువూకులపల్లె, కుప్పం పట్టణంలోని బీసీ కాలనీలోని ఓటర్ల జాబితాలోనూ ఉన్నట్లు తేలింది. ఈ పంచాయుతీలోనే 500 పైగా బోగస్ ఓట్లు ఉన్నట్లు నిర్ధారించారు. గుడుపల్లె వుండలంలోని పొగురుపల్లె, గుండ్లసాగరం పంచాయుతీల్లో 100కు పైగా ఓటర్లు ఇతర రాష్ట్రాల వారు ఉన్నట్లు తేలింది.
టీడీపీ ఇన్‌చార్జ్ ఇలాకాలో భారీగా బోగస్ ఓట్లు
కుప్పం నియోజకవర్గంనుంచి చంద్రబాబు నాయుడు 1989 నుంచి వరుసగా ఐదుసార్లు గెలుపొందారు. 1989లో 6,918, 1994లో 56,518, 1999లో 65,687, 2004లో 59,558, 2009లో 44,885 ఓట్ల మెజారిటీ సాధించారు. 1989లో మొదటిసారి సాధించిన మెజారిటీకి తరువాత 1994లో సాధించిన మెజారిటీకి మధ్య భారీ వ్యత్యాసం కనిపించడం బోగస్ ఓట్ల వల్లనేనన్న విమర్శలు వినవస్తున్నాయి. అప్పటినుంచే బోగస్ ఓటర్ల నమోదుకు శ్రీకారం జరిగివుంటుందని, అందువల్లనే ఆ తరువాత జరిగిన ప్రతి సాధారణ ఎన్నికల్లో కూడా అదే మెజారిటీ కొనసాగి ఉంటుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ పీఎస్ వుునిరత్నం ఇలాకా కంగుంది పంచాయతీలో భారీ ఎత్తున బోగస్ ఓట్లు బయుటపడటాన్ని ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న ఈ పంచాయతీలో 5,124 మంది ఓటర్లు ఉన్నారు. తమిళనాడులోని తివ్ముంబట్ట సమీపం అరసనాపురం పంచాయుతీకి చెందిన గొల్లపల్లె వాసులు 1,000 వుందికిపైగా కంగుంది పంచాయుతీలోనూ బోగస్ ఓటర్లుగా ఉన్నారు. వీరి మధ్య బంధుత్వం ఉండటంవల్ల రెండు ప్రాంతాల్లోనూ ఓటర్లుగా చలావుణీ అవుతున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి పంచాయతీలో ఇలా ఉంటే నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ నేతలు తమిళనాడు, కర్ణాటక ప్రాం తాల్లోని బంధువర్గానికి చెందిన 10నుంచి 20వేల మందిని ఇక్కడ ఓటర్లుగా న మోదు చేయించినట్లు తెలుస్తోంది. వారందర్నీ రప్పించి ఓట్లు వేసుకోవడం వల్లే బాబుకు మెజారిటీ తగ్గకుండా వస్తోందన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది.
చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం లో నలభై మూడువేల బోగస్ ఓట్లుఉన్నట్లు అదికారులు గుర్తించారని వచ్చిన కధనం ఆసక్తికరంగా ఉంది.మొత్తం నియోజకవర్గంలో 1.96 లక్షలకుపైగా ఓటర్లుండగా, అందులో 43 వేల బోగస్ ఓట్లు ఉన్నట్లు రాష్ర్ట ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారన్నది ఆ కధన సారాంశం.కుప్పం టిడిపి అదినేత చంద్రబాబు నాయుడుకు కంచు కోటగా ఉంది. 1989 నుంచి అక్కడే పోటీ చేసి గెలుస్తున్నారు.తమిళనాడు,కర్నాటకలకు సరిహద్దుగా ఉండే ఆ నియోజకవర్గంలో పొరుగు రాష్ట్రాల ఓటర్ల పేర్లు కూడా ఉన్నాయన్నది అబియోగం.దీనిపై చర్య తీసుకుంటున్నట్లు అదికారులు చెబుతున్నారు.ఒక నియోజకవర్గంలో అన్ని బోగస్ ఉండడం జరిగితే అది మన వ్యవస్థకు అప్రతిష్టే.చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో 43 వేల బోగస్ ఓట్లు చాలు చంద్రబాబు గెలవడానికి..ఎంతైనా బాబు రూటే దొంగ రూటు… సొంత నియోజకవర్గంలో ఇలా బోగస్ ఓట్ల బాగోతానికి తెర తీసిన చంద్రబాబు తీరు పట్ల ఏపీలో సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.