సింగరేణి ఎన్నికల కౌంటింగ్ ఫలితాల ప్రక్రియ ప్రారంభమైంది. కొత్తగూడెం కార్పొరేట్ లో భాగమైన హైదరాబాద్ లోని సింగరేణి భవన్‌లో చేపట్టిన ఓట్ల లెక్కింపులో టీబీజీకేఎస్ బోణీ కొట్టింది. మొత్తం ఓట్లు 86 కాగా టీబీజీకేఎస్‌కు అత్యధికంగా 77 ఓట్లు పోలైయ్యాయి. హెచ్‌ఎంఎస్-1, బీఎంఎస్-2, ఏఐటీయూసీ-2, సీఐటీయూ-2 ఓట్లు పోలైయ్యాయి. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రతా కొనసాగుతుంది.
