సినిమాల్లోకి వచ్చిన తర్వాత కొంతమంది హీరోయిన్లు తమ సహచర హీరోలతో ప్రేమలో పడిపోతుంటారు. కొంతమందైతే ఇష్టమైతే డేటింగ్ చేస్తూ ఆ తర్వాత విడిపోతుంటారు. ఇదంతా సినీపరిశ్రమలో మామూలే. అలాంటిదే ఇప్పుడు ‘ఫిదా’ ఫేమ్ సాయిపల్లవి చేస్తోంది. ‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సాయిపల్లవి ఇప్పుడు ఒకరి ప్రేమలో పడి అతనితో డేటింగ్ చేస్తోందని తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్ నడుస్తోంది.
ఆ హీరో మరెవరో కాదు “ఓకే బంగారం”తో తెలుగు సినీపరిశ్రమకు పరిచయమైన దుల్కర్ సల్మాన్. ఈ యువహీరోతో కలిసి ‘ఓయ్ పిల్లగాడా’ అనే సినిమాలో ఈ భామ నటిస్తోంది. సినిమా ఘూటింగ్లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఆ ప్రేమ కాస్త ఇప్పుడు డేటింగ్ వరకు వెళ్ళిందట. మరి వీరి ప్రేమ గాథ కూడా సినిమా షూటింగ్ పూర్తయ్యేంత వరకు ఉంటుందా? లేకుంటే శాశ్వతంగా ఉంటుందా? అన్నదే కాలమే సమాధానం చెప్పాలి.