భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రభాస్‌తో ఫొటో దిగారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ సెట్‌ను సైనా, ఆమె తల్లిదండ్రులు సందర్శించారని చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ‘బాహుబలి’ వారితో ఫొటో దిగారు. ఈ ఫొటోను సైనా సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘బాహుబలి ప్రభాస్‌తో..’ అని ట్వీట్ చేశారు.
‘సాహో’ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ నటిస్తున్నారు. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇందులో బాలీవుడ్ నటులు జాకీ ష్రాఫ్, మందిర బేడి, నీల్ నితిన్ ముఖేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2018లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరోవైపు సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా హిందీలో ‘సైనా’ టైటిల్‌తోఓ బయోపిక్ రాబోతోంది. ఇందులో రీల్ లైఫ్ సైనాగా కూడా శ్రద్ధనే నటిస్తుండడం విశేషం. ఇందుకోసం శ్రద్ధ.. సైనా నుంచి శిక్షణ తీసుకుంటున్నారు.