ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషిపై సినీ, టీవీ సీరియల్ నిర్మాత అత్యాచారం చేయడమే కాకుండా దాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసిన దారుణ ఉదంతం ఢిల్లీ నగర శివార్లలోని నోయిడాలో వెలుగుచూసింది. నోయిడా నగరంలోని సెక్టార్ 15 ఈ బ్లాక్ లో గత రాత్రి సినీనిర్మాత తన ఇంట్లో పనిమనిషిపై అత్యాచారం చేశాడు. ఆపై దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. ఈ దారుణం గురించి పనిమనిషి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాధిత మహిళను వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించి నిందితుడైన సినీనిర్మాతను అరెస్టు చేశారు.
