తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జిల్లాలోని గోపాల్పేట్ పొలికెపహాడ్ గ్రామ సమీపంలోని తూడుకుర్తి గ్రామ శివారులో ఉన్న కేఎల్ఐ డీ-8 కాలువను తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి పాటు పడుతుంటే కాంగ్రెస్ నాయకులు కోర్టు కేసులతో అడుగడుగునా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో అభివృద్ధి నిరోధకులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. ప్రతిపక్షాలు ఇదే విధంగా ప్రవర్తిస్తే డిపాజిట్లు కూడా గల్లంతు కావడం ఖాయమని ఆయన అన్నారు .