పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం నియోజకవర్గం టీడీపీ నాయకులు మందేసి చిందేశారు. ఇంటి ఇంటికి తెలుగు దేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నేతలు ఈలలు కొడుతూ రోడ్డుపైనే స్టేప్పులు వేశారు. డాన్స్ చేసినవారు నలుగురు మహిళా MPTC లు,ఒకరు NSP మండలం పార్టీ అధ్యక్షుడు, 1మార్కెట్ యార్డ్ డైరెక్టర్, 1జిల్లా నాయకుడు,మండల స్థాయి నాయకుడు ఉన్నారు.
అంతేగాక వీరు తెలుగు దేశం పార్టీ కండువాలు కప్పుకొని మరీ డ్యాన్సులు చేయడంతో ఇంటి ఇంటికి తెలుగు దేశం పార్టీ కార్యక్రమం అంటే ఇదానా అంటూ అక్కడి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.