Home / SLIDER / ఘనంగా కాకా 88వ జయంతి వేడుకలు ..

ఘనంగా కాకా 88వ జయంతి వేడుకలు ..

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి 88వ జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ మహానగరంలోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న కాకా విగ్రహానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వెంకటస్వామి దేశానికి ఆదర్శ రాజకీయనాయకుడని.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని వక్తలు కొనియాడారు. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కాంగ్రెస్‌ అధిష్ఠానానికి తెలంగాణ ఇవ్వాల్సిందేనని నిర్మొహమాటంగా చెప్పిన వ్యక్తి కాకా అని చెప్పారు. రాబోయే తరం ఆయన ఆశయాలను గుర్తుంచుకోవాలంటే వెంకటస్వామి జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని ప్రజాకవి గద్దర్‌ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat