సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ జోరు కొనసాగుతుంది. ఇప్పటికే సింగరేణి భవన్, ఇల్లందులో విజయకేతనం ఎగురవేసిన టీబీజీకేఎస్ కొత్తగూడెం కార్పొరేట్‌లోనూ విజయం సాధించింది. 544 ఓట్ల ఆధిక్యంతో టీబీజీకేఎస్ గెలుపొందింది. కొత్తగూడెం కార్పొరేట్‌లో మొత్తం ఓట్లు 1475కాగా 1415 ఓట్లు పోలైయ్యాయి. వీటిలో టీబీజీకేఎస్‌కు 866 ఓట్లు రాగా ఏఐటీయూసీకి 322 ఓట్లు వచ్చాయి. మిగతా డివిజన్లలో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మణుగూరు, బెల్లంపల్లిలో టీబీజీకేఎస్ గెలుపు దిశగా పయనిస్తుంది
