హైదరబాద్ నగరంలో వ్యభిచారం పెరిగిపోతున్నది. రోజు పోలీసులు దాడులు జరిపి ఆరెస్ట్ లు జరుగుతున్న … మరోసటి రోజే మరో వీధిలో చిక్కుతున్నారు. తాజాటగా ఫ్యామిలీ సెలూన్ అంటూ వ్యభిచార దందా నడుపుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రవణ్ అనే వ్యక్తి ఎల్బీనగర్‌లోని కృష్ణనగర్‌లో డైమండ్ ఫ్యామిలీ సెలూన్ నిర్వహిస్తున్నాడు. అయితే, అందులో మసాజ్‌ల పేరుతో వ్యభిచారం నడుపుతున్నట్టు ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు విశ్వసనీయ సమాచారం అందుకున్నారు. దీంతో గురువారం సెలూన్‌పై దాడి చేసి శ్రవణ్‌తో పాటు ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. మరింత దర్యాప్తు నిమ్తితం వారిని నాచారం పోలీసులకు అప్పగించారు
