హైదరాబాద్: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇల్లందులో టీబీజీకేఎస్ ఘనవిజయం సాధించింది. 217 ఓట్ల మెజార్టీతో టీబీజీకేఎస్ గెలిచింది. ఇల్లెందులో కార్మిక సంఘాల వారిగా పోలైన ఓట్ల వివరాలిలా ఉన్నాయి. టీబీజీకేఎస్‌కు 617 ఓట్లు, ఏఐటీయూ- 400, హెచ్‌ఎంఎస్- 36, సీఐటీయూసీ-13, ఐపీటీయూ- 5 ఓట్లు వచ్చాయి. కాగా మరో రెండు స్థానాల్లో టీబీజీకేఎస్ విజయం దిశగా దూసుకెళ్తుంది. కొత్తగూడెం కార్పొరేట్, మణుగూరు ఓట్ల లెక్కింపులో టీబీజీకేఎస్ ముందంజలో ఉంది.