పరుగుల రాణి పి.టి. ఉష జీవితాధారంగా బయోపిక్ రాబోతోంది. ఇందులో రీల్ లైఫ్ ఉషగా బాలీవుడ్ స్థాయి నుండి హాలీవుడ్ కి ఎదిగిన ప్రముఖ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించనున్నట్లు ఆ చిత్ర వర్గాల టాక్ . ప్రముఖ దర్శకురాలు రేవతి వర్మ ఈ చిత్రాన్ని ఇటు తెలుగు, అటు తమిళంతో పాటు ఆంగ్లం, హిందీ, చైనీస్, రష్యన్ భాషల్లోనూ తెరకెక్కించనున్నట్లు సమాచారం .
అంతే కాదు ఏకంగా దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని ఫిల్మ్ వర్గాల టాక్ .ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్.రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.
ఇప్పటికే ప్రియాంక చోప్రా ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్ బయోపిక్‌లో నటించి అందరి ప్రశంసలు అందుకొంది. ఆమె ప్రస్తుతం హాలీవుడ్‌లో రెండు చిత్రాలతో బిజీగా ఉంది. దీంతో ఈ సినిమా దర్శకురాలు అయిన రేవతి కూడా మరో ఆరు నెలల తర్వాతే చిత్ర పనులు మొదలుపెడతానని ఆమె తెలిపారు .