ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వలసల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది .మరో ఏడాదిన్నర సమయంలో ఎన్నికల సమరం రానున్న నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తమ తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మార్పులకు రెడీ అవుతున్నారు .ఈ క్రమంలోనే అధికార టీడీపీ పార్టీకి చెందిన పలువురు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరాడానికి సిద్ధమవుతున్నారు .దీనిలో భాగంగా ఇటీవల రాష్ట్రంలో జరిగియన మంత్రి వర్గ విస్తరణలో కానీ పార్టీ పదవుల్లో కానీ మూడు దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకుని ఏళ్ల తరబడి సేవలు చేస్తున్న కానీ ఇతర పార్టీల నుండి అధికారం కోసం పదవి కోసం వచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పెద్ద పీట వేయడం పట్ల ఆ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు రగలిపోతున్నారు..
అధికారం కోసం నేతలను వాడుకుని వదిలేసే ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తత్వాన్ని బహిరంగంగానే ఎండగడుతున్నారు..నిన్నటికీ నిన్న అధికార టీడీపీకి చెందిన మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే బొజ్జల, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా..గోరంట్ల, బండారు తది తర ఎమ్మెల్యేలు పార్టీ పదవులకు రాజీనామా కూడా చేశారు అప్పట్లో ..ఇక బోండా ఉమ, చింతమనేని ప్రభాకర్ రాజీనామా చేస్తానని ఏకంగా మీడియా ముందు ప్రకటించి తర్వాత బాబు దెబ్బకు చల్లబడ్డారు.కానీ ఇటు మంత్రి పదవిపై అటు పార్టీ పదవులపై ఆశలు పెట్టుకున్న గుంటూరు జిల్లా ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తన ఆశ నెరవేరకపోవడంతో ఇప్పుడు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్టు జిల్లా రాజకీయాల్లో హాట్ హాట్‌గా వార్తలు వస్తున్నాయి.
మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్న కానీ తనను దారుణంగా మోసం చేశారు .ఆఖరికి ఇటీవల జరిగిన పార్టీ పదవుల్లో కూడా తనను తీవ్ర అవమానపరిచారు అని గుంటూరు నగర వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తన సన్నిహితుల వద్ద వాపోతున్నారు .పార్టీలు మారిన వారికి, నాలుగుసార్లు ఓడిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.అంతే కాకుండా ప్రస్తుతం నరసారావుపేట ఎంపీగా ఉన్న రాయపాటి సాంబశివరావు తర్వాత ఆ సీటు ఆయన తనయుడుకి బాబు కేటాయిస్తాడు అని టీడీపీ వర్గాలు తేల్చి చెప్పడంతో మోదుగుల పార్టీ మారడానికి సిద్ధమయ్యారు అని వార్తలు వస్తోన్నాయి .అంతే కాకుండా తన బావ, రాంకీ గ్రూప్స్ అధినేత అయోధ్య రామిరెడ్డి వైసీపీతరపున గత ఎన్నికల్లో నరసారావుపేట నుంచి వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలోనే వైసీపీలోకి జంప్ చేసే యోచనలో ఉన్న మోదుగుల పల్నాడులోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ఊహాగానాలు రాష్ట్రంలో వినిపిస్తున్నాయి.