ఏపీలో కాకినాడ లోని కలెక్టర్ కార్యాలయం వద్ద దారుణమైన సంఘటన చోటు చేసుకుంది .ఈ క్రమంలో కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈ రోజు ఒక మహిళ ఆత్మహత్యకు పాల్పడటంతో కలకలం రేగింది. ఈ రోజు బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని వెనుక గేటు సమీపంలో వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది.అయితే వెంటనే అప్రమత్తమైన అక్కడి సిబ్బంది ఆమెను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవడం వలన తీవ్ర గాయాలైన ఆమె చికిత్ప పొందుతూ మృతి చెందింది. అయితే ఈ మహిళ, సంఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
