తపాస్‌పల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ ద్వారా సిద్ధిపేట, కొండపాక మండలాల్లోని 20 గ్రామాలకు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. గోదావరి నీళ్లు మొట్టమొదటి సారి సిద్ధిపేట జిల్లాకు తెచ్చామని తెలిపారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు అని చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు సైతం సింగూర్ నుంచి 40 వేల ఎకరాలకు నీళ్లిచ్చే భాగ్యం కలిగిందన్నారు. ఈ కాలువ ద్వారా 31 చెరువులు నింపి సాగుకు నీరిందిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాంతం బాగా ఎత్తయింది కావడంతోనే ఇక్కడ మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు. దేవాదుల నుంచి ఈ ఏడాది 8.50 టీఎంసీల నీరు లిఫ్ట్ చేయాలని నిర్ణయించినట్లు హరీష్‌రావు వెల్లడించారు. గత ప్రభుత్వం 38.5 టీఎంసీలు మాత్రమే కేటాయిస్తే తెలంగాణ ప్రభుత్వం 60 టీఎంసీలకు పెంచిందన్నారు. తుపాకుల గూడెం వద్ద బ్యారేజీ నిర్మించి నీళ్లు తరలిస్తామన్నారు. కంతనపల్లి నుంచి తుపాకుల గూడెంకు బ్యారేజ్ మార్చడం వల్ల 12 గ్రామాలు మునగకుండా ప్రభుత్వం కాపాడిందని హరీష్‌రావు తెలిపారు.