ఉమ్మడి నల్గొండ జిల్లా సరిహద్దులో ఉన్న నియోజకవర్గాలు కోదాడ, హుజూర్‌నగర్‌లు ఆర్థికంగా శక్తివంతమైనవి. ఈ రెండు నియోజకవర్గాలు రైస్‌బౌల్‌గా నిలుస్తున్నాయి..అంతే కాదు చుట్టూ సిమెంట్ ఫ్యాక్టరీలతో హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాలు పారిశ్రామిక కేంద్రాలుగా పేరుగాంచాయి.అయితే అభివృద్ధిలో మాత్రం ఈ రెండు నియోజకవర్గాలు పూర్తిగా వెనుకబడిపోయాయనే చెప్పాలి. కోదాడ, హుజూర్‌నగర్‌లలో అంతర్గత రోడ్లు పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. నిత్యం వందలాది సిమెంట్ లారీలు రెండు నగరాలలో ప్రధాన రహదారులపై పయనిస్తుండడంతో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా హుజూర్‌నగర్‌లో దుమ్ము కాలుష్యం సమస్య తీవ్రంగా ఉంది..పదేళ్లుగా ఉత్తమ్ ఎమ్మెల్యేగా
ఉన్నా కాలుష్యాన్ని నియంత్రించలేదనే అభిప్రాయం హుజూర్‌నగర్ ప్రజల్లో నెలకొంది. అంతే కాదు రెండు నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య కూడా తీవ్రంగానే ఉంది. ఇక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేక ఈ రెండు నగరాల్లో రోడ్లపై మురుగునీరు పారడం కామన్. ఇక వర్షాకాలంలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. ముఖ్యంగా హుజూర్‌నగర్‌లో అంతర్గతంగా సీసీ రోడ్ల నిర్మాణం పెద్దగా చేపట్టలేదు ఉత్తమ్..దీంతో చినుకు
పడితే చిత్తడిగా మారి ఊరంతా బురదమయంగా మారుతుంది. అడుగు తీసి అడుగు వేయాలంటే హుజూర్‌నగర్ వాసులకు నరకం కనపడుతుంది..కోదాడలో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా ఈ రెండు నియోజకవర్గాల్లో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం ప్రారంభం కాకపోవడం పట్ల ఇద్దరు ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
కోదాడ ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హుజూర్‌నగర్‌లో బలమైన నాయకులు లేరని గ్రహించిన ఉత్తమ్2009లో తెలివిగా కోదాడ నుంచి హుజూర్‌నగర్‌కు మారారు. 2009లో ఉత్తమ్ లేకపోవడంతో టీడీపీ అభ్యర్థి చందర్‌రావు గెలిచారు.దీంతో తన కుటుంబం ఆధిపత్యం కోదాడలో పట్టుతప్పుతుందని భావించిన ఉత్తమ్ గత ఎన్నికల్లో తన భార్య పద్మావతిని నిలబెట్టి గెలిపించారు..దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఉత్తమ్ ఫ్యామిలీ పట్టు కొనసాగుతుంది. అయితే రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్న ఉత్తమ్ తన స్వంత నియోజకవర్గం హుజూర్‌నగర్‌తో పాటు , భార్య నియోజకవర్గం కోదాడపై పెద్దగా దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు
హుజూర్‌నగర్‌లో బలహీనంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ బలోపేతం అధినాయకత్వం ఫోకస్ పెడుతుంది. మంత్రి జగదీష్ రెడ్డి హుజూర్‌నగర్ టీఆర్ఎస్‌లో వర్గ విబేధాలను రూపుమాపలేకపోయారు. అయితే టీఆర్ఎస్ అధినాయకత్వం మాత్రం ఉత్తమ్‌ను టార్గెట్ చేయాలని, వచ్చే ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థిని నిలపాలని భావిస్తుంది.
ఇక కోదాడలో మాత్రం టీఆర్‌ఎస్ బలంగానే ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ నుంచి చందర్‌రావు, శశిధర్ లాంటి బలమైన నాయకులు ఉన్నారు..ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో టికెట్ సాధించి పద్మావతిని ఓడించాలని భావిస్తున్నారు. అయితే కోదాడ, హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ ఫ్యామిలీకి ఇప్పటికి ఇప్పుడు పెద్దగా వ్యతిరేకత లేకున్నా వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి తిరగబడే అవకాశం ఉంది. బలమైన ప్రత్యర్థులు ఎదురైతే ఉత్తమ్ ఫ్యామిలీ ఓడిపోయినా ఆశ్చర్యం లేదు..హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌కు వ్యతిరేకత ఉన్నా చివరి నిమిషంలో రాజకీయం చేసి, అంగబలం , అర్థబలంతో గెలిచే సత్తా ఉంది. గత ఎన్నికల్లో ఓటమి తప్పదనుకున్నా చివరి నిమిషంలో మ్యాజిక్ చేసి గెలిచారు..కానీ కోదాడలో మాత్రం సీన్ వేరే ఉంది. ఇక్కడ ఉత్తమ్ భార్య పద్మావతికి గట్టిపోటీ ఎదురవనుంది..ఇకనైనా కోదాడ అభివృద్ధిపై దృష్టి పెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థుల చేతిలో పద్మావతికి పరాజయం ఎదురవక తప్పదు. అంతే కాదు వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో కోదాడ, హుజూర్‌నగర్‌లలో అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్‌కు ఓటు వేయాల్సిందే అని ప్రజలు భావిస్తే మాత్రం ఉత్తమ్ ఫ్యామిలీకి చుక్కెదురు ఎదురవడం ఖాయమని ఈ రెండు నియోజకవర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి కాంగ్రెస్ కంచుకోటలైన కోదాడ, నియోజకవర్గాలను అభివృద్దిలో వెనుకబడి
ఉండడం ఉత్తమ్ ఫ్యామిలీకి ప్రతికూలంగా మారనుంది. మరి రాజకీయ చతురతలో దిట్ట అయిన ఈ భార్యాభర్తలు వచ్చే ఎన్నికల్లో మళ్లీ మ్యాజిక్ చేస్తారో లేదో చూడాలి.