ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తనను కల్సిన లైంగిక దాడి బాధితురాలికి పది లక్షల రూపాయల ఫిక్సిడ్ డిపాజిట్ తో పాటుగా ఉండటానికి ఇల్లు ను కూడా మంజూరు చేశారు .అంతే కాకుండా ఆమె ఉన్నత చదువులకు అయ్యే ఖర్చులను తమ ప్రభుత్వం భరిస్తుంది అని ఆయన కనిగిరి లైంగిక దాడి బాధితురాలికి భరోసా కల్పించారు .
కనిగిరిలో ఒక డీగ్రీ కళాశాలలో చదువుతున్న ఒక యువతి కార్తిక్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది .ఆ పరిచయాన్ని అడ్డుపెట్టుకొని ఆమెను ఆ ఊరు చివర ఉన్న పంట పొలాలకు పిలిపించుకొని మరి తన స్నేహితులతో కల్సి ఆమె పై లైంగిక దాడికి తెగ బడ్డారు .ఈ క్రమంలో సాయి అనే యువకుడు ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడుతుంటే కార్తిక్ ఆ దృశ్యాలను తన మొబైల్ ఫోన్ లో చిత్రీకరించాడు .తనను ఏమి చేయద్దు అని కాళ్ళ వ్రేళ్ళ పడ్డ కానీ ఆ దుర్మార్గులు కనికరించలేదు .
అంతే కాకుండా ఆ యువతి ఎంతగా వేడుకున్న కానీ వినకుండా ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడుతూ ఆమె వస్త్రాలను చించి వేస్తూ వికృత చర్యలకు ప్రయత్నాలు చేశారు .అంతే కాదు ఏకంగా ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది .వెంటనే స్థానిక పోలీసులు కేసును నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు .ఈ విషయం తెల్సిన టీడీపీ మహిళ సీనియర్ నాయకురాలు ..రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి కనిగిరి వెళ్లి ఆ యువతిని పరామర్శించి నిన్న బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకెళ్ళి పరిస్థితులను వివరించింది .