ఏపీ లో ప్రకాశం జిల్లాలో దశాబ్దం పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న బూచేపల్లి కుటుంబం రాజకీయాల నుండి తప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా ..?.రాజకీయాలకు దూరంగా ఉండాలా అనే విషయంపై బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఉన్నారా ..?.అయన రాజకీయాలకు గుడ్ బై చెప్తే వైసీపీ పార్టీకి నష్టమా అంటే ..?అవును అనే అంటున్నాయి రాజకీయ వర్గాలు .
ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో బూచేపల్లి కుటుంబానిది ఒక ప్రత్యేకత ఉంది . అదే ఏమిటి అంటే బూచేపల్లి శివప్రసాద్ తండ్రి సుబ్బారెడ్డి, శివప్రసాద్ రెడ్డి ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించారు.ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది బూచేపల్లి కుటుంబం .
ప్రకాశం జిల్లాలో దశాబ్దన్నర కాలం నుంచి రాజకీయాల్లో తమదైన ముద్రతో సాగుతున్న బూచేపల్లి కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటే వైసీపీ పార్టీకి తీరని లోటు అని ఇటు వైసీపీ శ్రేణులు ..రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు .గత దశాబ్దన్నర కాలంగా ఇక్కడ ఎంతో బలమైన నేత కావడమే కాకుండా స్థానిక ప్రజల్లో పాటుగా జిల్లా వ్యాప్తంగా బూచేపల్లి కుటుంబానికి మంచి ఆదరణ ఉంది .అంతే కాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి మంచి పోటి ఇవ్వడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో టీడీపీకి చుక్కలు చూపించే సత్తా ఉన్న నేత శివప్రసాద్ రెడ్డి .ఒకవేళ శివప్రసాద్ రెడ్డి రాజకీయాలనుండి తప్పుకుంటే అది వైసీపీకి తీరని నష్టం అని జిల్లా రాజకీయాల్లో చర్చించుకుంటున్నారు .