టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి బ్యార్య నందినీకి విడాకులు ఇచ్చి బద్రి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రేణుదేశాయ్‌తో సహజీవనం చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్నాళ్ళు కాపురం చేశాక.. పవన్ రేణూకి కూడా విడాకులు ఇచ్చి.. మూడోసారి విధేశీ భామని పెళ్లి చేసుకున్నసంగతి తెలిసిందే. అయితే ఇటీవల పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ ఒక ఇంటర్వ్యూలో మళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నానని.. తనకి , తన పిల్లలకి తోడుగా ఒక వ్యక్తి ఉంటే బాగుంటుందని.. చెప్పారు. దీంతో పవన్ తిక్క అభిమానులు రేణు దేశాయ్ పై తీవ్రంగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
మీరు మరో పెళ్లి చేసుకుంటే మీ గౌరవం తగ్గుతుందని కొందరు, మిమ్మల్ని అసహ్యించుకుంటామని పవన్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇక్కడ పవన్ అభిమానులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటటే.. మీ అభిమాన హీరో తనకి కోరికలు కల్గినప్పుడు పెళ్లి చేసుకొని సుఖాలు అనుభవించి.. పిల్లలు పుట్టించి.. చివరికి వారిని ఆమె మానాన వదిలేస్తే.. ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారైనా ఆలోచించారా.. భర్త వదిలేసిని భార్యని మన సమాజం ఎలాచూస్తుందో తెలుసుగా.. అంతే కాకుండా నిందలు.. కోట్ల రూపాయలు భరణం తీసుకుని విడాకులు ఇచ్చిందని నిందలు.. అయినా పవన్ అభిమానులు ఏం సాధించాలని ఇలా చేస్తున్నారో వారి విఙ్నత కే తెలియాలని సర్వత్రా చర్చించుకుంటున్నారు.