టాలీవుడ్ యంగ్ నేచురల్ స్టార్ నాని, హీరోయిన్ సాయి పల్లవి గొడవ పడినట్టు జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రచారాన్ని టాలీవుడ్ సినీ వర్గీయులు పెద్దగా పట్టించుకోలేదు. సినిమా అన్నప్పుడు గాసిప్పులు వస్తూనే ఉంటాయని లైట్ తీసుకొన్నారు. అయితే ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతున్న విశ్వసనీయ సమాచారం ఏంటంటే.. నాని-సాయిపల్లవిల గొడవ నిజమేనని తెలిసింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నాని-సాయిపల్లవి జంటగా ఎంసీఏ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.
అయతే ఈ సినిమా షూటింగ్ సందర్భంగా, ఓ డైలాగుకు సంబంధించి సాయి పల్లవికి నాని ఓ సలహా ఇవ్వబోయాడట. ఇదే వీరిద్దరి మధ్య గొడవకు కారణమయిందట. ఇప్పటికీ వీరిద్దరు ఎడమొహం, పెడమొహం లా ఉంటున్నారట. ఈ గొడవకు పులిస్టాప్ పెట్టేందుకు దర్శక-నిర్మాతలు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని తెలిసింది. వీరిద్దరూ కలసి ఏదో ఇక విధంగా షూటింగ్ పూర్తి చేసేసి… మాట్లాడుకోకుండానే వెళ్లిపోతున్నారట. వరుస హిట్స్ తో నాని జోరుమీదున్నాడు. స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు. మరోవైపు, సాయిపల్లవి ఇప్పుడిప్పుడే క్రేజ్ సంపాదించుకుంటోంది. ఆమె కెరీర్ లో ప్రేమమ్, ఫిదా రెండు హిట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలో బెట్టు చేయడం, ఏకంగా హీరోతో గొడవ పడటం ఆమె కెరీర్‌కి మంచిది కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.