పార్లమెంట్ సభ్యుడిగా అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాల్సిన ఆ ఎంపీ బాలికలపై నీచమైన వ్యాఖ్యలు చేశారు. అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడిన ఎంపీ తీరు వివాదాస్పదమైంది. ఛత్తీస్ఘర్ బీజేపీ ఎంపీ బన్సీలాల్ మహతో ఆ రాష్ట్ర బాలికలపై చేసిన లైంగిక వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. ఆయన అసభ్య వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చత్తీస్ఘర్ బాలికలు, యువతులు రెచ్చగొట్టేలా ఉంటారని ఆ వీడియోలో మహతో మాట్లాడుతూ కనిపించారు.అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున రెజ్లింగ్ పోటీల నేపథ్యంలో మహతో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.బీజేపీ నేత మహిళలపై చేసిన లైంగిక వ్యాఖ్యలను విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. మహతోపై కఠిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.