తెలంగాణలో అసలే కొనవూపిరితో ఉన్న టీటీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి శల్యసారథ్యం వహిస్తు న్నాడు. రేవంత్ ఒక్కడే కేసీఆర్‌తో పోరాడుతున్నా కానీ ఆయనకు సొంత పార్టీలోనే మద్దతు ఇచ్చేవారు కరువు అవుతున్నారు..ఇప్పటికే మెజార్టీ టీడీపీ నాయకులు, కార్యకర్తలు సైకిల్ దిగి కారు ఎక్కగా వచ్చే ఎన్నికల కల్లా ఉన్నవాళ్లలో 70 శాతం మంది నాయకులు, క్యాడర్ టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి కారణం టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కంటే రేవంత్ ఒంటెద్దు పోకడలే అని తెలుస్తోంది. ఇప్పటికే టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం లేదు.దీనికి కారణం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించడమే..ఆఖరికి ప్రెస్‌మీట్లు కూడా ఎల్. రమణతో సంబంధం లేకుండా పెడుతున్నాడు..పార్టీ కార్యక్రమాలన్నీ రేవంత్ తన కనుసన్నలలో నడపడం రమణకు నచ్చడం లేదు..అందుకే ఆయన టీఆర్ఎస్‌లో చేరిన తన సన్నిహితుడు ఎర్రబెల్లితో టచ్‌లో ఉంటున్నాడు. ఒక వేళ వచ్చే ఎన్నికల్లో జగిత్యాల టికెట్ ఆఫర్ చేస్తే టీఆర్ఎస్‌లో చేరడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం.
ఇక మరో సీనియర్ నాయకుడు మోత్కుపల్లికి, రేవంత్ రెడ్డికి తీవ్ర విబేధాలు ఉన్నాయి..రేవంత్ తీరును పలుమార్లు బహిరంగంగానే విమర్శించాడు మోత్కుపల్లి. వచ్చే ఎన్నికల నేపథ‌్యంలో రేవంత్ రెడ్డి టీటీడీపీ, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లేలా ఇప్పటి నుంచే స్కెచ్ వేస్తున్నాడు. .తన బంధువులు జైపాల్ రెడ్డి, జానారెడ్డిల సహకారంతో కాంగ్రెస్‌తో మిలాఖత్ అవుతున్నట్లు రేవంత్ చర్యలను బట్టి అర్థమవుతుంది..ఈ మధ్య ఎప్పుడు చూసినా టీటీడీపీ నాయకులతో సంబంధం లేకుండా రేవంత్ కాంగ్రెస్ నాయకులతో కల్సి రాసుకుని పూసుకుని తిరుగుతున్నాడు. దీంతో మిగిలిన టీటీడీపీ నాయకులు రేవంత్ తీరుపై మండిపడుతున్నారు. ముఖ్యంగా రేవంత్ అంటే ఏ మాత్రం పొసగని మోత్కుపల్లి లాంటి సీనియర్ నాయకులు పొత్తులపై రేవంత్‌తో విబేధిస్తూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. వచ్చే ఎన్నికల్లో టీటీడీపీ , కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే అవకాశమే లేదని తేల్చి చెప్పాడు..కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారు..అవసరమైతే టీఆర్ఎస్‌తోనో, బిజేపీతోనో పొత్తు పెట్టుకుంటాం కానీ ఆ దిక్కుమాలిన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేది లేదని మోత్కుపల్లి తేల్చి చెప్పాడు..ఇప్పటికే టీడీపీ అధినాయకత్వం కేసీఆర్‌కు సాగిలపడుతుంది..తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీకి వెళ్లినప్పుడల్లా ఏపీ ప్రజలే కాదు..టీడీపీ నాయకులు పోటీలు పడి ఆయనకు జేజేలు కొడుతున్నారు..ఇక పొత్తుల విషయానికి వస్తే
ఇప్పటికే తెలంగాణ బిజేపీ నాయకులు మాత్రం ఇంతకాలం టీడీపీతో పొత్తు పెట్టుకుని పార్టీని సర్వనాశనం చేసుకున్నామని..ఇక నుంచి స్వంతంగా ఎదుగుదామని ప్లాన్ వేస్తున్నారు..అవసరమైతే టీడీపీ, కాంగ్రెస్‌లోని నాయకులను బిజేపీలోకి లాగి టీఆర్ఎస్‌కు బలమైన ప్రత్యాన్మాయంగా ఎదగాలని బిజేపీ భావిస్తుంది..సో..టీటీడీపీకి కాంగ్రెస్ లేకుంటే టీఆర్ఎస్‌తో మాత్రమే పొత్తుకు అవకాశం ఉంది..కానీ కాంగ్రెస్‌తో పొత్తుకు టీటీడీపీ నాయకులు క్యాడర్ విముఖత చూపిస్తున్నారు..కేవలం రేవంత్ రెడ్డి మాట విని కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే వినాశనమే అని తెలంగాణ తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు..తెలంగాణలో బలమైన కమ్మ సామాజికి వర్గం ఇప్పుడు టీఆర్ఎస్‌కు మద్దతు పలుకుంది. సో టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవడమే బెటర్ అని మోత్కుపల్లి వ్యాఖ్యలను తెలంగాణ తమ్ముళ్లు సమర్థిస్తున్నారంట..మరి అదే జరిగితే కేసీఆర్‌కు వ్యతిరేకంగా రచ్చ చేస్తున్న రేవంత్ రెడ్డికి ఇక టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో, లేదా బిజేపీ పార్టీలో చేరడమే శరణ్యం. కాంగ్రెస్‌లో చేరితే బిజేపీ అధినాయకత్వం మళ్లీ ఓటుకు నోటు కేసు తిరగదోడుతుందని రేవంత్ రెడ్డి భయపడుతున్నట్లు సమాచారం. సో..బిజేపీలోకి వెళితే తెలంగాణలో ఆ పార్టీకి భవిష్యత్తు ఇప్పట్లో కష్టమే అని రేవంత్ భావిస్తున్నాడు..మొత్తానికి మోత్కుపల్లి వ్యాఖ్యలతో టీటీడీపీలో గందగోళం ఏర్పడడంతో పాటు
, రేవంత్ రెడ్డి భవిష్యత్తు ఆగమ్యగోచరంలో పడినట్లయింది.