ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపే అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టనున్న సంగతి తెల్సిందే .అయితే మొదట ఈ నెల అక్టోబర్ 27వ, తేది నుండి సుదీర్ఘంగా పాదయాత్ర నిర్వహించేందుకు ఆయన సన్నాహలు చేసుకొన్నారు. అయితే కొన్ని కారణాల రిత్య ముహూర్తం మార్చారు అని వైసీపీ శ్రేణులు ఇప్పటికే ప్రకటించాయి .
పాదయాత్ర చేపట్టే ముందు ఇడుపులపాయ నుండి తిరుమలకు జగన్ కాలికనడక ద్వారానే వెళ్ళనున్నారు.అక్కడ శ్రీవార్ని దర్శించుకొని అనంతరం ఆయన పాదయాత్రను ప్రారంభించనున్నారు .దీనికి సంబంధించిన పాదయాత్ర రూట్‌మ్యాప్‌ను వైసీపీ తయారు చేస్తున్నారు.ఇందులో భాగంగా మొత్తం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పాదయాత్ర సాగేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
త్వరలో చేపట్టబోయే తన పాదయాత్ర ద్వారా ప్రజల్లో బాబు సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న పలు అవినీతి అక్రమాల గురించి ప్రచారం చేయనున్నారు.అంతేకాదు తాము అధికారంలోకి వస్తే అమలు చేయనున్న 9 అంశాలను కూడ అదే సమయంలో ప్రజల వద్దకు తీసుకెళ్ళనున్నారు. ప్రతి గ్రామానికి ఈ ప్రచారం వెళ్ళేలా జగన్ ప్లాన్ చేస్తున్నారు.