వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాజాగా త్రిదండి చినజీయర్ స్వామితో సమావేశమయ్యారు. శంషాబాద్‌లో ఉన్న చినజీయర్ ఆశ్రమానికి ఆయన ఈ రోజు తన పార్టీ నాయకులతో కలిసి విచ్చేశారు. జగన్ వచ్చిన సమయంలో ఆయన ను సాదరంగా తన ఆశ్రమానికి ఆహ్వానించిన చినజీయర్ స్వామీజీ.. వెళ్లేడప్పుడు కూడా జగన్ కారు దగ్గరకు వచ్చి మరీ వీడ్కోలు పలికారు. దసరా సెలవుల నిమిత్తం వైఎస్ జగన్ బెంగుళూరు తన కుటుంబంతో కలిసి వెళ్లారు.. అటు నుంచి తిరిగి వస్తూ దారిలో ఆయన ఈ రోజు చినజీయర్ ఆశ్రమానికి వెళ్లారు. సుమారు అరగంట పాటు చినజీయర్‌తో జగన్ సమావేశమయ్యారు.
ఇక జగన్‌తో పాటు పాటుగా విజయ్ సాయి రెడ్డి ఇతర వైసీపీ నాయకులతో పాటు మై హోం అధినేత రామేశ్వరరావు కూడా ఉన్నారు. అయితే జగన్ చినజీయర్ స్వామిని కలయికపై తట్టుకోలేని టీడీపీ అనుకూల మీడియా ఎధావిధిగా పచ్చ వార్తలు వండివార్చేస్తోంది. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటే స్వామీజీల ద్వారా లాబీయింగ్ చేయాలనే జగన్ అలా చేస్తున్నారని కొందరు టీడీపీ నేతలు దిక్కుమాలిన అంచనాలు వేస్తున్నారు. ఎవరు ఏమన్నా జగన్ , జీయర్ స్వామిజీ నడుమ ఏకాంత చర్చలు సాగడంతో టీడీపీ బ్యాచ్ మాత్రం తట్టుకోలేక పోతున్నారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.