ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి ..అప్పటి ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు అయిన వైఎస్ షర్మిల రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటి చేయనున్నారా ..?.ఇప్పటికే షర్మిల కు లోక్ సభ స్థానాన్ని వైసీపీ అధినేత ఖరారు చేశారా ..?.సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండగానే అప్పుడే షర్మిల కు లోక్ సభ స్థానాన్ని జగన్ కేటాయించారా అంటే అవును అనే అంటున్నారు వైసీపీ శ్రేణులు .
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కడప జిల్లా లోక్ సభ నియోజకవర్గం నుంచి షర్మిలను ఎంపీగా పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నట్లుగా వైసీపీ శ్రేణులు అంటున్నారు . గత సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచిన ప్రస్తుత ఆ పార్టీ యంగ్ అండ్ డైనమిక్ ఎంపీ అవినాష్ రెడ్డికు నామినేటెడ్ పోస్టు కట్టబెట్టి షర్మిలను ఎంపీ చేయించాలని జగన్ ఆలోచిస్తున్నారు అంట .
ప్రస్తుతం జిల్లాలో పార్టీకి ఎదురు లేకుండా ఉన్న తరుణంలో షర్మిలను రంగంలోకి దించితే పార్టీకి అన్నివిధాలా మేలు అని పార్టీ నేతలు ,కార్యకర్తలు ,వైఎస్ అభిమానులు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు అంట .ప్రస్తుతం ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి కూడా తమ కుటుంబ సభ్యుడు కావడంతో జగన్ మాటకు విలువ ఇచ్చి తన సోదరి కోసం కడపను త్యాగం చేయడానికి కూడా సిద్ధమైనట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి .దీంతో వచ్చే ఎన్నికల్లో షర్మిల ప్రత్యేక్ష ఎన్నికల్లోకి దూకనున్నారు అన్నమాట .