Home / SLIDER / మహబూబాబాద్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం… ఎంపీ కవిత

మహబూబాబాద్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం… ఎంపీ కవిత

తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ మానుకోట‌ జిల్లాను  అన్ని విధాలా అభివృద్ధి చేస్తారని నిజామాబాద్  ఎంపీ కవిత అన్నారు. నిన్న  సింగరేణి ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఈ రోజు  మహబూబాబాద్‌కు వచ్చిన ఎంపీ  కవిత ఈసందర్భంగా మీడియాతో మాట్లాడారు. “కొత్తగూడెంలో సింగరేణి ప్రచారం ఘనంగా ముగిసింది. గ్రామాలను అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం. తెలంగాణలో నిరంతరం విద్యుత్ ఇచ్చి రైతుల మరణాలను ఆపిన వ్యక్తి సీఎం కేసీఆర్. రైతులకు పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేయించబోతున్న దేశంలోనే ప్రథమ వ్యక్తి, గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్. మా ప్రభుత్వ వైఖరి పేద ప్రజల పక్షాన నిలబడటమే” అని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat