హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి ధాటికి సామాన్యులతో పాటు, పలువురు ప్రముఖులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సినీ ప్రముఖులకు కూడా ఇబ్బందులు తప్పలేదు. ముఖ్యంగా హైదరాబాదులోని మణికొండలోని పంచవటి కాలనీ ఇటీవల ఖరీదైన ప్రాంతంగా మారింది. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ తరహాలో ఇక్క సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ ప్రముఖులు నివాసాలు ఏర్పర్చుకున్నారు. పలు విలాసవంతమైన అపార్ట్ మెంట్లు, రహదారులు, అందమైన పార్కులు, ప్రముఖుల రాకపోకలతో, ఈ ప్రాతం రిచ్‌గా కనిపిస్తుంటుంది.
అయితే ఈ ప్రాంతం గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు నీటితో నిండిపోయింది. దీనివల్ల ఈ కాలనీలో నివాసముండే ప్రముఖ దర్శకుడు రాజమౌళి తీవ్రంగా నష్టపోయాడు. దర్శకుడు రాజమౌళి గెస్ట్ హౌస్ పూర్తిగా నీట మునిగింది. ఇందులోకి నీరు వెళ్లి, మినీ థియేటర్‌ను నాశనం చేసింది. అలాగే నటి, ఎమ్మెల్యే రోజా, యువనటులు శివబాలాజీ, శర్వానంద్ వంటి సినీ ప్రముఖులు ఇబ్బంది పడ్డారట. రోజా ఇంటికి వెళ్లే రోడ్డుపై మూడు అడుగుల మేర నీరు నిలవడంతో రాకపోకలకి చాలా ఇబ్బంది పడ్డారట.