సమ్మక్క, సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.80 కోట్లు మంజూరు చేసినందున ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు గిరిజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి చందూలాల్ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించామని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతరైన ఈ మేడారం జాతరకు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు.