హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా హెచ్‌ఎండీఏ రూపొందించిన ప్రణాళికలు ఆచరణ దిశగా నేడు అడుగులు పడనున్నాయి. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అధ్యక్షతన బుధవారం బేగంపేటలోని మెట్రోరైల్ భవన్‌లో హెచ్‌ఎండీఏ ఏడవ బోర్డు సమావేశం జరగనుంది. దాదాపు ఏడాదిన్నర తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో దాదాపు 30కి పైగా అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు కీలక పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈ మేరకు హెచ్‌జీసీఎల్ తరపున ఏడు అంశాలు, ఇంజినీరింగ్ విభాగం తరపున మరో ఏడు, మిగిలినవి ప్లానింగ్, అడ్మిస్ట్రేటివ్ విభాగం తరపున ఎజెండాల రూపకల్పన చేశారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) తరపున హైవే ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం (హెచ్‌టీఎంఎస్), టీఎంఎస్ (టోల్ మేనేజ్‌మెంట్ సిస్టం), సిటీ ఐటీఎస్ మాస్టర్‌ప్లాన్, ఔటర్‌లో వే సైడ్ ఎమినిటైటీస్ (మౌలిక వసతుల కల్పన), ఔటర్ మొత్తంలో ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు, కండ్లకోయ జంక్షన్ భూ నిర్వాసితులకు నష్ట పరిహారం, రేడియల్ రోడ్లు, సీఆర్‌ఆర్‌ఐ నివేదిక ఆధారంగా ఔటర్‌లో చర్యలు, ఔటర్ భూ నిర్వాసితుల కోసం కోహెడా లే అవుట్ నిర్మాణ పనులకు అనుమతి తీసుకోనున్నారు.
ఇక ఇంజినీరింగ్ విషయానికొస్తే హుస్సేన్‌సాగర్‌లో రూ. 6 కోట్ల అంచనాతో మరో ఇంటరాఫ్షన్ అండ్ డైవర్షన్ (ఐ అండ్ డీ) నిర్మాణం, సంగారెడ్డి టౌన్‌లో కిలోమీటర్ మేర దాదాపు రూ. 8కోట్లతో రహదారి విస్తరణ పను లు, భువనగిరిలో రూ. 15కోట్ల అభివృద్ధి పనులు, బాలానగర్ ైఫ్లె ఓవర్ పనుల పూర్తికి చేపట్టాల్సిన చర్యలు, ఉప్పల్ భగాయత్ తరహాలో ఉప్పల్ కమర్షియల్ లే అవుట్, మూసీ రీవర్ ఫ్రంట్ అభివృద్ధి పను లు, ఉప్పల్ భగాయత్‌లో డ్రైనేజీ, పైపులైన్ విస్తరణ పనులు, హుస్సేన్‌సాగర్, మూసీ సుందరీకరణ, సరూర్‌నగర్‌లో కమర్షియల్ కాంప్లెక్స్, మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్, ల్యాండ్ ఫూలింగ్ స్కీం అమలు లాంటి ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ఐతే ఇందులో టెండర్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్న ప్రాజెక్టులకు బోర్డు అనుమతి తీసుకుని పనులను పట్టాలెక్కించనున్నారు. వీటితో పాటు 51 మంది జేపీవోల ఖాళీల భర్తీ, పలువురు ఉద్యోగుల పదోన్నతులపై సమావేశంలో చర్చ జరగనుంది. ప్రధానంగా సంస్థ ఇప్పటికే చేపట్టిన వేలంలో మిగిలిన పోయిన చిన్న చిన్న స్థలాలను మళ్లీ వేలం వేసేందుకు బోర్డు అనుమతి ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. తద్వారా సం స్థకు దాదాపు రూ. వెయ్యి కోట్ల ఆదాయాన్ని రాబట్టుకోవడం, కీలక పథకాలకు నిధులను వెచ్చించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరగనుందని అధికార వర్గాలు తెలిపాయి.