ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సర్కారు కు దాసోహం అయ్యాడు అని ఏపీపీసీసి చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు .
ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఖలేజా లేదు కాబట్టే రాష్ట్ర ప్రయోజనాలను ప్రధాని మోదీకి తాకట్టుపెడుతున్నారని అన్నారు. చంద్రబాబు రాష్ట్ర ద్రోహి అని అన్నారు.ప్రస్తుతం ఇంటింటికీ టీడీపీ అని ఆ పార్టీ నేతలు ప్రజల ఇళ్లకు వస్తున్నారని, వారిని ప్రజలు నిలదీయాలని రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రత్యేక రైల్వే జోన్, ఉక్కు కర్మాగారం, ప్రత్యేక ప్యాకేజీ లేక ప్రత్యేక హోదా అమలు గురించి కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడాలని ఆయన అన్నారు.