హైదరాబాద్ నగరంలో ఎయిర్‌పోర్టు సిటీ నిర్మాణంపై సీఎం కేసీఆర్ మంగళవారం సమీక్ష చేపట్టారు. ప్రగతి భవన్‌లో చేపట్టిన ఈ భేటీ సందర్భంగా సీఎం స్పందిస్తూ.. హైదరాబాద్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలు, సకల సౌకర్యాలతో అద్భుతమైన ఎయిర్‌పోర్టు సిటీగా తీర్చిదిద్దాలని తెలిపారు. పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా టర్మినల్ విస్తరణ చేపట్టాలన్నారు. అదేవిధంగా రెండో రన్‌వే నిర్మాణ పనులు ప్రారంభించాలని చెప్పారు. అంతర్జాతీయ సదస్సులకు హైదరాబాద్ వేదికగా నిలుస్తున్నందున ఉన్నత ప్రమాణాలు, అత్యుత్తమ సౌకర్యాలతో 12 వేల మంది పట్టే విధంగా కన్వెన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్ సెంటర్లు నిర్మించాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహకారం అందిస్తమని చెప్పడంతో ఎయిర్‌పోర్టు సిటీ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతానని సీఎం తెలిపారు.
