టాలీవుడ్‌లో అతితక్కువకాలంలోనే అగ్రతారగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో తొలిసారి స్పైడర్ చిత్రంలో నటించింది. మురుగదాస్ దర్శకత్వ వహించిన స్పైడర్ సినిమా పైన రకుల్ భారీ అంచనాలనే పెట్టుకుంది. అయితే స్పైడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ఆ చిత్రంలో రకుల్ తళుక్కున మెరిసి మళ్ళీ కనిపించకుండా పోయే పాత్రతో నటించింది. అందునా ఆమె చేసిన క్యారెక్టర్ పై కూడా విమర్శలు కురిపించారు ప్రేక్షకులు. ఇక స్పైడర్ గురించి చెప్పుకోవాలంటే.. మహేష్, మురుగదాస్, ఎస్ జే సూర్యల గురించి చెప్పుకుంటున్నారు.. కానీ ఒక్కరు కూడా రకుల్ గురించి చెప్పుకోవడంలేదట. దీనితో రకుల్ ప్రీత్ సింగ్ షాకై మూలన కూర్చుని ఓ రోజంతా బాధపడిపోయిందట. ఆ తర్వాత తేరుకున్న రకుల్ మళ్లీ మహేష్ బాబుతో చేస్తారా అని అడిగితే.. బుద్ధుంటే మళ్లీ మహేష్ బాబుతో నటించనని స్వయంగా తన స్నేహితులకు చెప్పిందట. ఈ వార్త ఆనోట ఈనోట పాకి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
