టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. అనుష్క మధ్య చాలా రోజులుగా లవ్ స్టొరీ నడుస్తున్నట్లు ఇండస్ట్రీలో బలంగా టాక్ వినిపిస్తుంది. అయితే త్వరలో వాళ్ళిద్దరూ పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇన్ని రోజులు ఈ వార్తలని అటు అనుష్క ఇటు ప్రభాష్ కొట్టిపారేస్తూ వచ్చారు. అయితే తాజాగా అందరికీ షాక్ ఇచ్చే విధంగా ఈ ఏడాది డిసెంబర్ లో ప్రభాస్ – అనుష్క నిశ్చితార్ధం జరగనుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్, సెన్సార్ బోర్డు మెంబర్ ఉమర్ సందు గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యే అందరికి తెలిసిన విషయం తాజాగా జై లవకుశ, స్పైడర్ సినిమాలకి ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చిన అతని అఫీషియల్ గా తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా ప్రభాస్ – అనుష్క నిశ్చితార్ధం వార్తని కన్ఫర్మ్ చేసాడు. బాహుబలి ప్రభాస్ ఫ్యాన్స్ కి స్వీట్ న్యూస్ అంటూ ఈ వార్తని రివీల్ చేసాడు. మరి ఇందులో నిజానిజాలు ఏంటి అనేది ఇరు వర్గాల నుండి ఎవరో ఒకరు స్పందిస్తే అసలు విషయం తెలియదు.