తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గత మూడున్నర ఏండ్లుగా చేస్తోన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ ,ఇతర పార్టీలకు చెందిన నేతలు ,కార్యకర్తలు టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు .
ఈ క్రమంలో మెదక్ జిల్లా కంగ్టి మండలం నాగర్ కే గ్రామానికి చెందిన టీడీపీ మరియు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు దాదాపు 50 మందికి పైగా కార్యకర్తలు స్థానిక శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారి సమక్షంలో అధికార టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ లో చేరిన వారికీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు