డేరాబాబా అరెస్ట్ అయినప్పటి నుంచి అతని దత్తపుత్రిక హనీప్రీత్, పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నది. ఆమెను ఎలాగైనా పొట్టుకోవాలని, పోలీసులు విశ్వప్రయత్నాలు చేసినా.. ఆమె ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోయారు. అయితే ఎట్టకేలకు హనీప్రీత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పంచకుల పోలీస్ కమిషనర్ దృవీకరించారు. హనీప్రీత్‌ను అరెస్ట్ చేశామని, బుధవారం ఆమెను కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. గుర్మీత్ జైలుపాలైన తర్వాత నుంచి అజ్ఞాతంలో ఉన్న ఆమెను ఓ జాతీయ మీడియా ఆమెను ఇంటర్వ్యూ చేసింది. ఇక ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని చెప్పింది. తాను దేశం విడిచి పారిపోలేదని, త్వరలో కోర్టులో లొంగిపోతానని హనీప్రీత్ అంతకు ముందు పేర్కొన్నారు. గుర్మీత్ ను పోలీసు కస్టడీని నుంచి తప్పించడానికి హనీ కుట్రపన్నిందనే ఆరోపణలు రావడం తెలిసిందే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి గాలించారు. ఆమె దేశం నుంచి పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తనకు బాబాతో అక్రమ సంబంధం లేదని హనీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ మంగళవారం ప్రసారమైన నేపథ్యలో ఆమె అరెస్ట్ కావడం గమనార్హం.