తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన జక్కన్న చెక్కిన బాహుబలి సిరీస్ చిత్రాలు కలెక్షన్ల పరంగా కొత్త చరిత్రని సృష్టించాయి. టాలీవుడ్‌లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న బాహుబలి చిత్రాలు తర్వాతి స్థానంలో గ్రాస్ కలెక్షన్స్ పరంగా ఎన్టీఆర్ తాజా చిత్రం జై లవకుశ సినిమా నిలిచింది. దసరా కానుకగా విడుదల అయిన ఈ చిత్రం 200 కోట్ల గ్రాస్ వైపు దూసుకుపోతుంది. బాహుబలి, బాహుబలి-2 చిత్రాల తర్వాత సెకండ్ హయ్యస్ట్ గ్రాస్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా జైలవకుశ రికార్డ్ సృష్టించనుంది. ప్రస్తుతం జై లవకుశ ఊపు చూస్తుంటే.. హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన తెలుగు చిత్రాల్లో జైలవకుశ సెకెండ్ ప్లేస్‌ను కన్‌ఫాం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
