ప్రస్తుత రోజుల్లో ఒక సెలబ్రిటీ గురించి ఏ ఒక్క చిన్న వార్త వచ్చినా కానీ అది ఆ సెలబ్రిటీ ఫ్యాన్స్‌కు ఎంతో ఉత్సాహాన్ని ..ఆసక్తిని కల్గిస్తుంది .అందులో ముఖ్యంగా టీంఇండియా కు చెందిన క్రికెటర్లంటే అసలు చెప్పేది ఏముండదు . ఈ క్రమంలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఫొటో కూడా ఒకటి నిన్న బాగా చెక్కర్లు కొట్టింది.
అది కూడా పాండ్యా ఒక అమ్మాయితో దిగిన సెల్ఫీ. ఇంకేం.. పుకార్లు మొదలయ్యాయి. ఆమెతో ఉన్న సంబంధం ఏంటి అంటూ చాలా మంది ప్రశ్నల వర్షం కురిపించారు. ఏదైనా గుడ్‌న్యూస్ ఉంటే వెంటనే చెప్పెయ్ అని కూడా కొందరు కామెంట్స్ చేశారు. ఇక లాభం లేదనుకున్న పాండ్యా ఇవాళ క్లారిటీ ఇచ్చాడు. మిస్టరీ వీడింది.. ఆమె నా చెల్లెలు అంటూ అతను ట్వీట్ చేశాడు. దీంతో ఆ ఒక్క ట్వీట్ తో తన అభిమానులకు ఉన్న సందేహాలన్నీ తీర్చేశాడు .