సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలుపు ఖాయమని ఎంపీ పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలోని జీకే ఓపెన్ కాస్ట్‌లో టీబీజీకేఎస్ ప్రచారం నిర్వహించింది. ఎన్నికల ప్రచారంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. సింగరేణి కార్మికుల కష్టాలు సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసునని స్పష్టం చేశారు. డిపెండెంట్ ఉద్యోగాలను పోగొట్టిందే జాతీయ సంఘాలని పొంగులేటి మండిపడ్డారు.టీబీజీకేఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎంపీ కవిత, పలువురు నేతలు పాల్గొన్నారు.
