సింగరేణి ఎన్నికల సందర్భంగా టీటీడీపీ, కాంగ్రెస్, సీపీఐ పార్టీలు బలపర్చిన ఏఐటీయూసీ తరపున టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మంగళవారం శ్రీరాంపూర్ డివిజన్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి టీబీజీకేఎస్‌కు ఓటేస్తే సింగరేణిని
అమ్మడం ఖాయమని అన్నారు. కేసీఆర్ మాయమాటలతో కార్మికులను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్ గారడి మాటలను నమ్మి కార్మికులు మోసపోవద్దని రేవంత్ కోరారు. అయితే రేవంత్‌తో పాటు కాంగ్రెస్, సీపీఐ నాయకులు ఎంతగా ప్రచారం చేసినా ఏఐటీయూసీకి పెద్దగా ఊపు రావడం లేదు. మరో పక్క టీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ ప్రచారంలో దూసుపోతుంది.. ప్రతిపక్షాలన్నీ ఏకమైనా టీబీజీకేఎస్ గెలుపును అడ్డుకోలేరని టీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇస్తున్నారు.