ఏపీలో నిన్న మొన్నటి వరకు అధికార పార్టీ అయిన తెలుగు దేశం పార్టీలోకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,ఆ పార్టీకి చెందిన నేతలు చేరుతున్న సంగతి తెలిసిందే .దీనిలో భాగంగానే ఇప్పటి వరకు ఇరవై మందికిపైగా ఎమ్మెల్యేలు ,ఇద్దరు ఎంపీలు అధికార టీడీపీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు .అందుకే టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నలుగురికి మంత్రి పదవిలిచ్చాడు .
అయితే తాజాగా కర్నూలు జిల్లా రాజకీయాల్లో మంచి ప్రాధాన్యత ఉన్న కోట్ల ఫ్యామిలీకు చెందిన ఒకరు వైసీపీలోకి రీఎంట్రి ఇవ్వడానికి సిద్ధమయ్యారు .రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికల్లో పత్తికొండ అసెంబ్లీ నియోజక వర్గ స్థానాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోట్ల కుటుంబానికి చెందిన కోట్ల చక్రపాణి రెడ్డికి కేటాయించారు .అప్పట్లో ప్రస్తుత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చేతిలో ఓడిపోయారు .
దీంతో ఆయన కొనాళ్ళు ప్రత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తోన్నారు .తాజాగా ఆయన వైసీపీలోకి రీఎంట్రి ఇవ్వడానికి సిద్ధమయ్యారు .ఆ క్రమంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఆలూరు అసెంబ్లీ నియోజక వర్గం నుండి బరిలోకి దిగటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోన్నారు .అందులో భాగంగా దేవనకొండ లో ఈ నెల 5 న కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు అని కోట్ల వర్గీయులు అంటున్నారు .ఆ రోజు భారీ బహిరంగ సభను నిర్వహించి వైసీపీ పార్టీలో ప్రత్యేక్ష రాజకీయాలకు రీఎంట్రి ఇవ్వడానికి సిద్ధమయ్యారు అంట .