భారతీయ బ్యాంకుల్లో కోట్లాది రూపాయలు అప్పు చేసి లండన్ కు పారిపోయిన విజయ్ మాల్యాను అక్కడి పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. ఆయనపై భారత్లో ఇప్పటికే కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన కేసుకు సంబంధించిన పలు ఆధారాలను సీబీఐ, ఈడీ అధికారులు లండన్ లోని న్యాయస్థానానికి అందించారు. విజయ్ మాల్యాను మరోసారి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. విజయ్ మాల్యాను అరెస్టు చేసిన అంశంపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
