హైదరాబాద్ నగర శివార్లోని బాటా సింగారం, మంగళంపల్లిలో లాజిస్టిక్ పార్కులకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ( HMDA) ఆధ్వర్యంలో ప్రజలు, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ పార్కులను ఏర్పాటు చేయనున్నారు. హయత్ నగర్ మండలంలోని బాటా సింగారంలో 35 కోట్ల వ్యయంతో 40 ఎకరాల్లో ఈ పార్కును సకల సౌకర్యాలతో నిర్మించనున్నారు. అలాగే ఇబ్రహీంపట్నం మండలంలోని మంగళంపల్లిలో 20 కోట్ల రూపాయల వ్యయంతో 22 ఎకరాల్లో కూడా అన్ని వసతులతో లాజిస్టిక్ పార్కు ఏర్పాటుకు రేపు శ్రీకారం చుట్టనున్నారు. అంకాన్ డిజైన్లతో HMDA ఈ రెండు పార్కులను రెండేళ్లలో ఆకర్షనీయంగా రూపొందించనుంది. ఈ పార్కుల్లో వసతి గృహాలు, హోటళ్లు, డాబాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమర్షయల్ కాంప్లెక్స్, పెట్రోల్ బంక్, వాహనాల పార్కింగ్, వెర్ హౌసింగ్ లతో అన్ని వసతులు కల్పించనున్నారు.