రకుల్ ప్రీత్ సింగ్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది చూడటానికి పొడవుగా ..బక్కపలచగా ..చూడగానే మత్తెక్కించే అందం ..కానీ ఈ అమ్మడు టాలీవుడ్ లో ఉన్న అందరి హీరోయిన్ల కంటే తానూ డిఫరెంట్ అని నిరూపిస్తుంది .ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ రేంజ్ కు చేరుకున్న ముద్దు గుమ్మలు నైట్ కి నైట్ బాలీవుడ్ ఇండస్ట్రీ ట్రైన్ ఎక్కారు .
కానీ అంతగా విజయవంతం కాలేకపోయారు .నాటి అసిన్ దగ్గర నుండి నేటి తాప్సీ వరకు అందరు ఇక్కడ స్టార్డమ్ రాగానే బాలీవుడ్ ట్రైన్ ఎక్కేశారు .
తీరా అక్కడకి వెళ్ళిన తర్వాత సరైన హిట్స్ లేకపోవడంతో ఇటు బాలీవుడ్ లో అవకాశాలు రాక ..మరల టాలీవుడ్ వైపు చూడలేక సతమతమవుతూ తమ కెరీర్ ను నాశనం చేసుకున్నారు .
అందుకే రకుల్ ప్రీత్ సింగ్ ఉత్తరాది అమ్మాయి అయిన కానీ బాలీవుడ్ లోకి వెళ్ళడం ఇష్టం లేదు అంట .కారణం ఏమిటి అని అడిగితే ఇదిగో ఇదే జవాబిచ్చింది అమ్మడు .ఎంతైనా అమ్మడు పేరుకు బక్కపలచు అయిన కానీ తెలివి మాత్రం అమోఘం కదా ..అయితే గత చరిత్రను చూస్తే ప్రస్తుతం టాలీవుడ్ లో తనకు ఉన్న డిమాండ్ పడిపోకుండా ఉత్తరాదిన సినిమాలు చేస్తోందనీ, మిగతా హీరోయిన్లతో పోల్చుకుంటే రకూల్ తెలివే తెలివి అంతా అంటున్నారు ..