Home / LIFE STYLE / మీ ఇల్లాలు మీతో కర్కశంగా ఉంటుందా ..అయితే ఇలా చేయండి ..?

మీ ఇల్లాలు మీతో కర్కశంగా ఉంటుందా ..అయితే ఇలా చేయండి ..?

నువ్వంటే నాకిష్టం… నీ నవ్వంటే నా కిష్టం… అంటూ రోజులో ఒక్కసారైనా భార్యను ప్రేమగా చూసుకుంటే ఆమె ఎంతగా మురిసి… మైమర్చిపోతుందో గమనించండి… ఎందుకంటే భార్య భర్త నుంచి కోరుకునేది అదే కాబట్టి. ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందన్న మాట వాస్తవం… కానీ పురుషులకు ఆమె కష్టాన్ని మరిపించే ఒక్క మాటైనా మాట్లాడడానికి అహం అడ్డువస్తోంది. కుటుంబ భారాన్ని మోసేది భర్త… కుటుంబాన్ని నడిపించేది భార్య… ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. కాలంతోపాటు వచ్చిన మార్పుల్లో ఇప్పుడు దంపతులిద్దరూ బాధ్యతలను భారాన్ని సమానంగా పంచుకుంటున్నారు. కాబట్టి ప్రశంసలు కూడా ఇద్దరికీ దక్కాలి. అదే అన్యోన్య దాంపత్యానికి నిదర్శనం. మన కోసం అనుక్షణం కష్టపడే భార్యను ప్రశంసించడం భారం కాదు… బాధ్యత.

కుటుంబమనే రథానికి భార్యభర్తలు జోడుగుర్రాలు. ఒకేలా సాగితేనే ప్రయాణం సాఫీగా సాగుతుంది. కష్టం ఇద్దరిదీ అయినప్పుడు ప్రశంసలు ఒక్కరికే పరిమితం కాకూడదు. భర్త తన భార్యను మరో తల్లిగా భావిస్తే… భార్య తన భర్తను తొలి బిడ్డగా భావిస్తుందట. అటువంటి దాంపత్యంలోనే అన్యోన్యత వర్థిల్లుతుంది. అనుబంధం కలకాలం నిలువాలంటే పొగడ్తలు, ప్రశంసలే టానిక్కులు. కాపురంలో ఈ చికిత్స ఎన్నాళ్లు కొనసాగితే ఆ దాంపత్యం అన్నాళ్లు ఆరోగ్యంగా ఉంటుంది. భర్త నోటి నుంచి వచ్చే చిన్న ప్రశంసను భార్య ఓ వరంలా భావిస్తుంది. అందుకోసం ఎదురు చూస్తుంది. దానికి ఉన్న మహత్యం అటువంటిది. ప్రశంస ప్రాధాన్యాన్ని పాఠకులకు తెలియజేసేందుకు అందిస్తున్న ప్రత్యేక కథనం.పరమశివుడిని అర్ధనారీశ్వరుడంటారు. శరీరంలో అర్ధభాగాన్ని భార్యకు ఇచ్చినందుకు ఆయనకు దక్కిన గౌరవం ఇది. సృష్టిస్థితిలయకారకుడైన భగవంతుడే భార్యకు అర్ధభాగమిస్తే సామాన్య మానవులం మనం మాత్రం ఆమెపై నిర్లక్ష్యం చూపుతుంటాం. ప్రతి దాంపత్యంలో భార్యభర్తలిద్దరూ సరిసమాన పాత్రధారులు. భార్యాభర్తలు తోడునీడ వంటి వారు. మెట్టినింట అడుగుపెట్టిన మహిళకు తొలిరోజుల్లో భర్తే సర్వస్వం. ఇల్లు స్వర్గంగా… భర్త, పిల్లలే దేవుళ్లుగా భావిస్తుంది. తెల్లవారు జామున నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఎంతో శ్రమిస్తుంది. రుచికరమైన వంట చేసి వడ్డించడం నుంచి ఇంటిని అందంగా అలంకరించుకునే వరకు అన్నింటా ఆమె ప్రాధాన్యం స్పష్టంగా కనిపిస్తుంది. భర్తను మురిపించాలని, మెప్పించాలని ఆశిస్తుంది. ఆయన ప్రశంస కోసం ఎదురు చూస్తుంది. కానీ ఆమె కష్టాన్ని, శ్రమను గుర్తించే మగ మహారాజులు అతి తక్కువ సంఖ్యలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆఫీసులో తామే కష్టపడుతున్నామని, భార్య ఇంట్లో ఉండి చేసేదేముందిలే అన్న భ్రమలో బతికేస్తుంటారు. శభాష్… బాగా చేశావ్ అన్న ఒక్క మాట కోసం ఆమె ఎదురుచూస్తోందన్న విషయాన్ని గుర్తించరు. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఎదురుచూపు ఎప్పుడు ఫలించినా ఆమె కష్టం అప్పటితో మర్చిపోతుంది. లేదంటే మరో రోజు కోసం ఎదురు చూస్తుంది.

యాంత్రిక జీవనం…
ఒకప్పుడు సంప్రదాయ సంకెళ్లు… ఇప్పుడు యాంత్రిక జీవనం… మహిళకు శాపం అనవచ్చు. ఒకప్పుడు భర్తే దైవం… ఆయన మాటే వేదం… భార్య వంటింటికే పరిమితం అన్న పెద్దల మాట వల్ల భార్య కష్టానికి గుర్తింపు లేకుండా పోయేది. కాలంతోపాటు మహిళ ప్రాధాన్యం పెరిగినా ఆమె కష్టానికి తగిన గుర్తింపు మాత్రం లభించడం లేదు. యాంత్రిక జీవనంలో పడిన మనిషి బంధాలు, అనుబంధాల ఒడిని చేరుకోలేకపోతున్నాడు. సంపాదన యావలో పడి, భార్యాపిల్లలకు ప్రేమ, ఆప్యాయతలు పంచే బాధ్యతను విస్మరిస్తున్నాడు. అహం అనే చట్రంలో చిక్కుకున్న ఎందరో భర్తలు కనీసం బాగా చేశావ్ అన్న మాట కూడా అనడానికి ఇష్టపడటం లేదు. ఎవరిపని వారిదే అన్నట్లుగా అంటీ ముట్టనట్లుగా వ్యవహరించే దంపతులు ఎందరో…. పెళ్లి అనే బంధం తప్ప…. ఆప్యాయతా…అనురాగాల అనుబంధాన్ని పెంచుకోలేకపోతున్నారు.

నిర్లక్ష్యం… అహం
భార్యంటే అన్నింటా తనకంటే తక్కువని, ఇంటి యజమానిగా తను గీసిన గీతే శాసనమని, కుటుంబ సభ్యులెవరికీ ఎదురు చెప్పే హక్కులేదని, భార్యంటే వంటింటికే పరిమితం కావాలన్న సంప్రదాయ వాదులు ఇప్పటికీ మనకు తారసపడుతుంటారు. పుట్టుకతో వచ్చిన అహం, నిర్లక్ష్య భావంతో కొందరు భార్యను ప్రశంసించేందుకు ఇష్టపడరు. భార్య శ్రమను గుర్తించకపోగా, అది ఆమె బాధ్యతగా ఆలోచిస్తున్నారు భర్తలు. ఇటువంటి దంపతుల మధ్య బంధం కూడా అంతే కృత్రిమంగా ఉంటుంది. సంప్రదాయ సంకెళ్ల మధ్య బంధీలుగా తప్ప ఆప్యాయతానురాగాల బంధం వారి మధ్య కనిపించొద్దు. అదే భార్యచేసే పనిలో కష్టాన్ని, ప్రేమను, ఆప్యాయతను, బాధ్యతను గుర్తించి గౌరవించే భర్తకు ఆమె మనసులో శాశ్వత స్థానం లభిస్తుంది. ఆ భర్తపై ఆరాధన, గౌరవం పెరుగుతాయి.

సందర్భం వచ్చినప్పుడల్లా…
భార్యను ప్రశంసించడంలో కృత్రిమత్వం ఉండకూడదు. మీరిచ్చే కాంప్లిమెంట్‌లో వంద శాతం నిజాయితీ కనిపించాలి. సందర్భానికి తగ్గట్టు ప్రశంస ఉంటే ఆమె మురిసిపోతుంది… మైమర్చిపోతుంది. మీపై ఆరాధన పెంచుకుంటుంది. భార్య పది రోజులు పుట్టింటికి వెళ్లింది. చేతిపాకమో, హోటల్ తిండితోనో గడిపిన మీరు ఆమె తిరిగి వచ్చాక చేసిన వంట తింటూ మళ్లీ నోటికి జీవం వచ్చింది… నీ చేతి వంట తినకుంటే నాకు ఏదోలా ఉంటుంది అంటూ ప్రశంసించి చూడండి. ఆమె మోము అరవిరిసిన మందారంలా విచ్చుకుంటుంది. ఆ ప్రశంసలో వంద శాతం నిజాయితీని ఆమె గ్రహిస్తుంది. అందుకే టీ, టిఫిన్ పెట్టినప్పటి నుంచి రాత్రి పడుకునే ముందు వరకు ఏదో ఒక సందర్భంలో భర్తగా ఆమె మనసుకు సాంత్వన పలికే ఒక్క మాట చాలు ఆమె తన రోజంతటి కష్టం మర్చిపోయేందుకు.

ఆలోచనా విధానం మారాలి
భార్య అనగానే వంటపని, ఇంటి పని చేసుకునే మహిళ అన్నది సగటు భర్త ఆలోచన. ఈ విధానం మారాలి. ఆఫీసులో భర్త చేసే పనికంటే పది రెట్లు ఎక్కువ పని ఇంట్లో భార్య చేస్తుందని గుర్తించాలి. పిల్లల్ని చూసుకోవడం, ఇంటిపనులు చేయడమేభార్య విధి అని, మరెందులోనూ జోక్యం చేసుకోకూడదన్న కొందరి అభిప్రాయం. కానీ ఇది తప్పు. కుటుంబ విషయాల్లో ఆమె అభిప్రాయాలను గౌరవించాలి. పదిమందిలో ఉన్నప్పుడు రెండు మంచి మాటలు చెప్పాలి. సందర్భం వచ్చినప్పుడల్లా ఆమె ప్రాధాన్యాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులు, పిల్లల వద్ద చెబితే ఆమె తన కష్టాన్ని మర్చిపోయి కుటుంబం కోసం మరింత కష్టపడుతుంది. ఇదేం గొప్పా… ఇంతేగా నువ్వు చేసేది అనేటువంటి మాటలు వాడకపోవడం మంచిది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat