మీరు ఆరోగ్యవంతమైన ఆహార ప్రణాళికను పాటిస్తూ, రోజూ వ్యాయామం చేస్తున్నప్పటికీ, మీ శరీర బరువు పెరుగుతూ ఉండవచ్చు. దీనికి కారణం ఏమిటి? సమాధానం మీరు ఉపయోగిస్తున్న మందుల అరలో ఉండవచ్చు.మందులు మీ ఆకలిని పెంచడం ద్వారా లేదా కెలరీలను ఖర్చు చేసే మీ శరీర సామర్థ్యాన్ని తగ్గించి, మీ శరీరంలో అత్యధిక మోతాదులతో ద్రవాలను నిల్వ చేయడం లేదా రెండు విధాలుగానూ మీ బరువును పెంచవచ్చు.
ఈ మందుల ప్రభావం వ్యక్తులందరిపై ఒకేలా ఉండదు. ఒక మందు వలన ఒక వ్యక్తి 3 నుండి 4 కేజీల బరువు పెరిగితే, మరొక వ్యక్తి ఎటువంటి బరువు పెరగకపోవచ్చు.మీ బరువును పెంచే కొన్ని మందులు దిగువన జాబితా చేశాము..
యాంటీడిప్రెసెంట్స్ :
సర్వసాధారణంగా సూచించే యాంటీడిప్రెసెంట్‌లు ఎస్ఎస్ఆర్ఐలు లేదా నిర్దిష్ట సెరోటోనిన్ రెయిప్టేక్ ఇన్‌హిబిటర్స్. సెరోటోనిన్ అనేది మనస్థితిని నియంత్రించే హార్మోన్ మరియు ఈ హార్మోన్ స్థాయి డిప్రెషన్‌లో తక్కువగా ఉంటుంది. సెరోటోనిన్ ఆకలిని నశింపచేసే మందు వలె కూడా పని చేస్తుంది దీని వలన ఎస్ఎస్ఆర్ఐలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. అయితే, సెరోటోనిన్ మరియు ఇతర ఆకలి నియంత్రణ హార్మోన్ల మధ్య క్లిష్టమైన పారస్పరిక చర్య వలన, ఎస్ఎస్ఆర్ఐలు మీ ఆకలిని పెంచవచ్చు మరియు బరువు పెరగడానికి కారణం కావచ్చు.
బీటా బ్లాకర్స్ :
బీటా బ్లాకర్స్‌ను అత్యధిక రక్త పోటు మరియు నిర్దిష్ట గుండె సమస్యల చికిత్స కోసం ఉపయోగిస్తారు. సర్వసాధారణంగా ఉపయోగించే బీటా బ్లాకర్‌ల్లో అటెనోలాల్, ప్రోప్రానోలాల్ మరియు మెటాప్రోలాల్ ఉన్నాయి. ఈ మందులు మీ జీవక్రియ మందగించేలా చేస్తాయి, ఈ కారణంగా వ్యాయామానికి మీ శరీర ప్రతిక్రియ క్షీణిస్తుంది. కనుక, మీ శరీరం ప్రతిరోజూ చేసే వ్యాయామం వ్యవధికి తక్కువ కెలోరీలు ఖర్చు అవుతాయి. అదనంగా, బీటా బ్లాకర్‌ల వలన అలసట అనిపిస్తుంది, ఈ కారణంగా శారీరక కార్యాచరణ పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది మరియు తక్కువ కెలోరీలు ఖర్చు అవుతాయి.
కార్టికోస్టెరాయిడ్స్ :
ప్రెడ్నిసోలోన్, ప్రెడ్నిసోన్ లేదా మెథ్లేప్రెడ్నోసోలోన్ వంటి కార్టికోస్టెరాయిడ్‌ల్లో బలమైన వాపు తగ్గించే లక్షణాలు ఉంటాయి. వీటిని సాధారణంగా ఆస్తమా సమస్యలు, చర్మ అలెర్జీలు, కీళ్లవాతం, స్వీయ రోగ నిరోధక శక్తి వ్యాధులు మొదలైన వాటి చికిత్సలో ఉపయోగిస్తారు. కార్టికోస్టెరాయిడ్‌ల వలన నీటి నిల్వ పెరిగి, ఆకలి అధికమవుతుంది. సమస్యల మరింత తీవ్రంగా మార్చడానికి, ఈ మందులు వలన పెరిగే అధిక కొవ్వు మీ నడుము చుట్టూ పేరుకుని పోతుంది.
యాంటీ-అలెర్జీ మందులు :
యాంటీ-అలెర్జీ మందులను సెటిరిజైన్, డిఫెన్హేడ్రామైన్, ఫెక్సోఫెనాడైన్ మరియు లారాటడైన్ వంటివి హిస్టామైన్ హార్మోన్‌ల చర్యను నిరోధించడం ద్వారా అలెర్జీలకు చికిత్సకు ఉపయోగపడతాయి. హిస్టామైన్ మన ఆకలిని నియంత్రిస్తుంది మరియు ఇది మెదడులోని నిర్ధిష్ట గ్రాహకంతో మిళితమైనప్పుడు ఆకలి మందగింపుకు కారణమవుతుంది. హిస్టామైన్ యొక్క చర్య నిరోధించబడినప్పుడు, దీని వలన ఆకలి పెరుగుతుంది మరియు బరువు పెరుగుతారు.
యాంటీడయాబెటీక్ మందులు :
టైప్ 1 మరియు టైప్ 2 డయాబెటీస్‌ల కోసం సర్వసాధారణంగా సూచించే ఇన్సులిన్ ఒక యానాబోలిక్ హార్మోన్. ఇది కొవ్వు, గ్లూకోజ్ మరియు ప్రోటీన్ యొక్క నిల్వను ప్రోత్సహిస్తుంది. కనుక, ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది. సల్ఫోనేలురీస్ మరియు పియోగ్లిటాజోన్ వంటి టైప్ 2 డయాబెటీస్ కోసం నోటిలో వేసుకునే కొన్ని మందులు ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి క్లోమమును ఉత్తేజపరుస్తాయి మరియు ఇది కూడా బరువు పెరగడానికి దారి తీస్తుంది. రక్తంలోని చక్కెర ఆకస్మికంగా తగ్గిపోవడం వలన డయాబెటీస్‌లో సర్వసాధారణంగా సంభవించే హైపోగ్లేసీమియా కూడా ఎక్కువ తినడానికి మరియు కెలోరీల స్థాయిని పెంచడానికి కారణమవుతుంది.
మూడ్ స్టెబిలైజర్స్ :
క్లోజాపైన్, లిథియమ్, రిస్పెరిడోన్ మరియు ఓలాంజాపైన్ వంటి మందులను బైపోలార్ సమస్య లేదా మనోవైకల్యం వంటి మానసిక ఆరోగ్య సమస్యల చికిత్స కోసం ఉపయోగిస్తారు. ఈ మందులు ఆకలిని గణనీయంగా పెంచుతాయి మరియు బరువు పెరగడానికి కారణమవుతాయి.
బరువు పెరగడం అనేది పలు మందుల ఇతర ప్రతికూల ప్రభావం. అయితే, దీని అర్థం మీరు చికిత్సను ఆపివేయాలని కాదు. ఇటువంటి సమస్యను నిర్వహించడానికి మీ బరువును ఎల్లప్పుడూ పరిశీలించుకుంటూ, శారీరకంగా సక్రియంగా ఉంటూ మరియు ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులను అనుసరించాలి. ఇంకా, బరువును తీవ్ర స్థాయిలో ప్రభావితం చేయని ఏవైనా ప్రత్యామ్నాయ మందులను సూచించాలని మీ వైద్యులతో చర్చించాలి.