ఏపీ రాష్ట్రానికి కేంద్ర అధికార పార్టీ అయిన బీజేపీ పార్టీకి కేంద్ర మాజీ మంత్రి ,సీనియర్ ఎంపీ అయిన ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రస్తుత భారతఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో సరైన నేత లేడన్నది జగమెరిగిన సత్యం .ఇదే విషయం గురించి రాష్ట్ర నేతలతో పాటుగా కేంద్రంలో ఉన్న జాతీయ అధిష్టానం కూడా పలుమార్లు ఒప్పుకుంది .ఈ క్రమంలో వెంకయ్య తర్వాత పార్టీని నడిపించడానికి సమర్ధవంతమైన నేత కోసం పార్టీ జాతీయ అధిష్టానం ఆలోచనలు చేస్తుంది .
ఈ క్రమంలో రాష్ట్రంలో పార్టీ పగ్గాలు ఎమ్మెల్సీ ,టీడీపీ సర్కారు అవినీతిపై ..బాబు అసమర్ధత పై నిత్యం విరుచుకుపడే సోము వీర్రాజు కివ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది అని వార్తలు వచ్చాయి .ఆ తర్వాత అవి వట్టి పుకార్లు అని పార్టీ వర్గాలు కొట్టేశాయి .ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కి అప్పజేప్పతారు అని కూడా న్యూస్ కొన్నాళ్ళు హాల్ చల్ చేశాయి .కానీ తాజాగా పార్టీ పగ్గాలు సరికొత్త వ్యక్తికీ అప్పజేప్పనున్నారు అని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి .
ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ లో చేరి బాబు నేతృత్వంలో దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు పేరు తెరపైకి వచ్చింది. ఒకవేళ మంత్రి మాణిక్యాలరావుకు పార్టీ పగ్గాలు ఇస్తే కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి ఈ పదవి ఇచ్చినట్లవుతుందని, అది పార్టీకి సామాజిక పరంగా కలిసొస్తుందని ఆ పార్టీ జాతీయ నాయకత్వం భావిస్తోంది.అయితే గత కొన్నాళ్లుగా బాబుకు అనుకూలంగా మాట్లాడుతున్న మాణిక్యాల రావుకు ఈ పదవి రావడం వెనక త్వరలోనే తనకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి చెక్ పెట్టించాలని బాబు ఇలా స్కెచ్ వేశాడు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి .